ఆకట్టుకున్న చిన్నారుల నృత్యం
(వేముల సదానందం)
వరంగల్ : చారిత్రక వేయి స్థంబాల దేవాలయ ప్రాంగణలో మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాహలం, చిన్నారుల నృత్య ప్రదర్శనల నడుమ జిల్లా పాలనా యంత్రాంగం ఆధ్వర్యంలో శ్రీ విరోధి నామ సంవత్సర వేడుకలను జిల్లా కలెక్ట్ డా.బి.జనార్థన్ రెడ్డి, ఎస్.పి.విశ్వనాద్ చెన్నప్ప సజ్జనార్ లు ప్రారంభించారు. జ్యోతి ప్రజల్వన తదుపరి సముద్రాల శఠగోపాచార్యులచే పంచాగ శ్రవణం జరిగింది. శుభ గ్రహాల ఆదిపత్యం అధికంగా ఉండడం వల్ల ఈ వల్ల ఈ విరోధి నామ సంవత్సరంలో వర్షాలు బాగా పడడంతో పాటు జిల్లాకు శ్రేయస్కరంగా ఉంటుందని తమ పంచాగ పఠనంలో తెలిపారు. మంత్రి కుజ స్థానంలో ఉన్నందున చెడు కూడా జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాడూరి శిష్య బృందం చేసిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నాయి.
News Posted: 28 March, 2009
|