అలరించిన కవి సమ్మేళనం
(వేముల సదానందం)
వరంగల్ : శ్రీ విరోధి నామ ఉగాది వేడుకల్లో భాగంగా సాంప్రదాయంగా నిర్వహిస్తున్న కవి సమ్మేళనం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. యువకి, సబ్ రిజిష్ట్రర్ పొట్లపల్లి శ్రీనివాస్ రావు సంయోజుకులుగా వ్యవహరించిన ఈ కవిసమ్మేళనాన్ని ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు తమ కవితలతో ప్రారంభించారు. కలెక్టర్ డా.బి.జనార్థన్ రెడ్డి, ఎస్.పి.సజ్జనార్ లు ఆసక్తిగా పొల్గొన్న ఈ కార్యక్రమాలలో డా.బన్న అయిలయ్య, విఆర్ విద్యార్థి, నూర శ్రీనివాస్, జరీనాబేగం, కంచాళ శోభాణి, దేవులపల్లి వెంకటేశ్వర్ రావు, వనపర్తి పద్మావతి, సిరాజోద్దిన్, నందనం కృపాకర్, వడుగు గోపాలరావు, శ్రీరంగస్వామి, శనిగరపు రాజ్ మోహన్, వల్సపైడి, అపరాజిత, ఎస్.లక్ష్మీనారాయణ, పల్లేరు వీరాస్వామిలు తమ ఉగాది కతలతో శ్రోతలను అలరించారు. ఈ సందర్బంగా మల్లవరపు నళినిశోభ రచించిన కవితా శోభ, కవితా సంకలనాన్ని జిల్లాకలెక్టర్ , ఎస్.పి.లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వల్సపైడి వ్యవహరించగా, జిల్లా పౌరసంబంధాల అధికారి కె.వెంకటరమణ వందన సమర్పణ చేశారు.
News Posted: 28 March, 2009
|