డమ్మీ అభ్యర్థులపై కలెక్టర్ ఆదేశం
(వేముల సదానందం)
వరంగల్ : ప్రస్తుత ఎన్నికల్లో పోటే చేసే మరో అభ్యర్థికి మేలు జరిగేందుకు ఎన్నికల్లో నామినేషన్ వేసే అభ్యర్థుల ప్రచార సరళిని వాహనాల ఉపయోగాన్ని నిశితంగా పరిశీలించాలని రిటర్నింగ్ అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి డా.బి.జనార్థన్ రెడ్డి ఆదేశించారు. ఎన్నికల చట్టాల్లో డమ్మీ అభ్యర్థులని ప్రత్యేకంగా లేరని అయితే, సీరియస్ గా పోటీలో ఉండే అభ్యర్థి తనకు ఇతరత్రా సౌలభ్యాలకు ఉపయోగ పడ్తారని భావించి డమ్మీ అభ్యర్థులుగా తన వ్యక్తులనే అభ్యర్థులుగా రంగంలో నిలిపే అవకాశముందని తెలిపారు. పోలింగ్ రోజున ఈ డమ్మీ అభ్యర్థి ఉపయోగించు వాహనాలు, నియమించే పోల్ ఏజెంట్లు ఇతర అభ్యర్థులకు సహకరించే అవకాశం ఉందనీ, వీరు పోలింగ్, కౌంటింగ్ సమయాల్లో సమస్యలు సృష్టించే అవకాశముందని తెలిపారు. అయితే, ఎన్నికల అధికారులు ఈవిధమైన డమ్మీ అభ్యర్థులను ఎన్నికల ప్రచారం మొదలైన కొద్ది రోజుల్లోనే గుర్తించవచ్చని డమ్మీ అభ్యర్థులకు సంబంధించిన సమాచారం తెలియగానే డమ్మీ అభ్యర్థులు నిర్వహించే ప్రచార సరళిని, వాహనాల ఉపయోగాన్ని వీడియో తీయించి, ఎప్పటికప్పుడు పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేసి డమ్మీ అభ్యర్థులపై ప్రజలను చైతన్య పర్చాలని రిటర్నింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News Posted: 30 March, 2009
|