ఆదర్శ రైతుల తొలగింపు
(వేముల సదానందం)
ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన సభలో పాల్గొన్నందుకు గాను మద్దూరు మండలానికి చెందిన ముగ్గురు ఆదర్శ రైతులను తొలగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి డా.బి.జనార్థన్ రెడ్డి తెలిపారు. మార్చి 16న మద్దూరు మండల కేంద్రంలో నిర్వహించిన రాజకీయ సభకు ఆదర్శరైతులు హాజరైనారని వచ్చిన వార్తలపై విచారించి తగు చర్య తీసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ను ఆదేశించినట్లు తెలిపారు. ఈవిషయంలో తగు విచారణ జరిపిన జాయింట్ డైరెక్టర్ మద్దూరు మండల కేంద్రానికి చెందిన ఆదర్శరైతులు ఎఫ్.ఎం.షాకత్ అలీ, ఈ.కుమార్, కొమురవెల్లి కనకయ్యలను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారని కలెక్టర్ తెలిపారు.
News Posted: 30 March, 2009
|