వరంగల్ : పోలీసులు జిరిపిన తనిఖీలలో ఇరవైమూడు లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా చింతగల్ల వద్ద రహదారులపై సోమవారం జరిపిన తనిఖీలలో 23 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసకున్నారు. ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు వివిధ పార్టీల అభ్యర్థులు నగదును తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ వాహనంలో ఇరవైమూడు లక్షల రూపాయల నగదు బయటపడింది. రామారావు అనే వ్యక్తి ఈ నగదును తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని విచారణ జరుపుతున్నారు.