రాజకీయాల్లో కొరవడిన సేవ
(వేముల సదానందం)
వరంగల్ : రాజకీయా నాయకుల్లో సేవామార్గం కొరవడిన కారణంగా ప్రజల కష్టాలను పట్టించుకోకపోవడంతో రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మహబూబాబాద్ షెడ్యూల్ తెగల లోకసభ ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి దుమావతు తిరుపాల్ నాయక్ (డిటినాయక్) అన్నారు. స్థానిక అశోక హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి ఆరు దశాబ్దాలు గడుస్తున్నా బంజారాలకు సామాజిక న్యాయం జరగలేదున్నారు. సామాజిక న్యాయం, సేవేవార్గంతో మార్పు తేవాలనే గొప్ప సంకల్పంతో ఆవిర్భవించిన ప్రజారాజ్యం పార్టీ పట్ల ఆకర్షితుడనై ప్రజాసేవ చేడానికి రాజకీయ రంగప్రవేశం చేశాన్నారు. పేద బంజారా కుటుంబంలో పుట్టిన నేను అనేక కష్టాలను చవి చూశాను కాబట్టి ప్రజాసేవలోనే జీవించానని డిటినాయక్ తెలిపారు. ఎం.బి.బి.ఎస్ విద్యను అభ్యశించిన తాను వైద్యుడిగా సేవలు అందిస్తూనే సివిల్ సర్వీస్ రాసి ఐపిఎస్ గా పోలీస్ సర్వీస్ లోకి వచ్చిన వారిలో తాను మొట్టమొదటి వ్యక్తిగా నిలిచానన్నారు. వివిధ హోదాల్లో పనిచేసిన తాను వరంగల్ జిల్లా ప్రజలకు సుపరిచుతుడనన్నారు.
వరంగల్ ఎస్పీగా, డిఐజి, ఐజిగా పనిచేసిన తనకు జిల్లాలో అసంఖ్యాంకంగా హితులు, సన్నిహితులు, బంధువులు ఉన్నారన్నారు. పదవీ విరమణ అనంతరం ప్రజా సేవలో తన శేషజీవితాన్ని గడపాలని నిశ్చయించుకున్న తరుణంలో ప్రజారాజ్యం పార్టీలో చేరారన్నారు. తాను పూర్తిగా తెలంగాణకు చెందిన వాడినేనని ఒక ప్రశ్నకు సమాదానంగా చెప్పారు. అయితే బతుకు తెరువుకోసం కృష్ణానది తీరంవైపు వలస వెళ్ళిన కుటుంబంలో జన్మించాన్నారు. తదుపరి హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల పెద్దల చేత ఆశీర్వాదాలను స్వీకరించిన డిటినాయక్ నామినేషన్ ధాఖలు చేశారు.
News Posted: 31 March, 2009
|