స్వతంత్ర అభ్యర్థిగా లక్ష్మీప్రసాద్
(వేముల సదానందం)
వరంగల్ : నిన్నటి వరకు ప్రజారాజ్యం పార్టీలో కో కన్వీనర్ గా పని చేసిన డా.నాగవరపు లక్ష్మీప్రసాద్ నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేష్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీలో సామాజిక న్యాయం కొరవడిందనీ, డబ్బులు ఇచ్చినవారికే టికెట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు. గత రెండు సంవత్సరాలుగా నర్సంపేట నియోజకవర్గంలో 294 గ్రామాలు, తండలలో 75 వేమంది ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాననీ ఆయన తెలిపారు. పలు జిల్లాల్లో ప్రజారాజ్యం పార్టీ కార్యలయాల్లో 'టూ లేట్' బోర్డులు తగిలించుకొన్నాయని ఆయన అన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో అధికారి కాంగ్రెస్ పార్టీకీ స్వతంత్ర అభ్యర్థిగా తనకూ మధ్య పోటీ ఉన్నా తాను విజయం సాధించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చెప్పినా కాంప్రమైజ్ కానని, పోటీలో ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
News Posted: 31 March, 2009
|