పోలింగ్ కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ నిఘా
(వేముల సదానందం)
వరంగల్ : జిల్లాలో సమస్యాత్మక పోలింగే కేంద్రాలలో పోలింగ్ లో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరకుండా పర్యవేక్షించేందుకు సూక్ష్మస్థాయి పరిశీలకులను నియమిస్తున్నట్లు కలెక్టర్ డా.బి.జనార్థన్ రెడ్డి వెల్లడించారు. ఎన్నికల సంఘం నియమించిన 18 మంది కేంద్ర పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు అధికారులు, పోలీసు అధికారులు, జాయింట్ కలెక్టర్ వి.కరుణ, ఎస్పీ వి.సి.సజ్జనార్లతో ఉమ్మడి సమావేశం కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కేంద్రాలలో సూక్ష్మ పరిశీలకులు నియమించడం వల్ల పోలింగ్ సరళని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారలకు తెలపడంతో పాటు రికార్డు చేస్తారని అన్నారు. అంతేకాక ప్రతీ ఓటరును వీడియో తీయించనున్నట్లు తెలిపారు. ఏ పోలింగ్ కేంద్రంలో నైతే ఓటరు గుర్తింపు కార్డులు అతి తక్కువగా ఉన్న కేంద్రాలు, ఓటర్లు వలసలు ఎక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాలు, గతంలో సాఫీగా పోలింగ్ జరగని కేంద్రాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో సూక్ష్మ పరిశీలకులను నియమిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సూక్ష్మ పరిశీలకులుగా కేంద్ర ప్రభుత్వ, బ్యాంకు అధికారులనే నియమించనునట్లు ఆయన చెప్పారు. ఏ గ్రామంలోనైతే సమస్యలు సృష్టించే వ్యక్తులపై గ్రామ స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలు గట్టి నిఘా నిర్వహిస్తాయిని అన్నారు.
News Posted: 2 April, 2009
|