పోలింగ్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్లు
(వేముల సదానందం)
వరంగల్ : జిల్లాలో జరుగనున్న సాధారణ ఎన్నికలకు దాదాపు 20వేల మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సేవలు ఉపయోగించుకుంటున్నందున వీరందరికీ ఓటు వేసేందుకు పోస్టల్ బ్యాలెట్లు అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. దాదాపు 80 శాతం ఉద్యోగులందరూ వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోనే ఉన్నందున పోస్టల్ బ్యాలెట్ల దరఖాస్తుల పంపిణి తదితర పనులకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించామని చెప్పారు. ఈ సారి ఎన్నికలకు ప్రయివేట్ సిబ్బందిని డ్రైవింగ్, వీడియోగ్రఫీ తదితర పనులుకు ఉపయోగించుకోనున్నందున వారందరూ గెజిటెడ్ అధికారి ధృవీకరణ పత్రం అందజేస్తే వారికి కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు నమోదు చేయడానికి అనుమతినిస్తున్నట్లు చెప్పారు.
News Posted: 2 April, 2009
|