గ్రామాలపై నిఘా
(వేముల సదానందం)
వరంగల్ : జిల్లాలో 346 గ్రామాలు తీవ్రవాద ప్రభావిత గ్రామాలు, 300లకు పైగా సమస్యాత్మకగ్రామాలున్నాయని ఈ పోలింగ్ కేంద్రాలలో సాఫీగా, ఏవిధమైన అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ నిర్వహించడానికి కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ వి.సి.సజ్జనార్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 10,092 మందిని ముందు జాగ్రత్త చర్యగా అరెస్ట్ చేయడం జరిగిందని, 1781 హిస్టరీ షీట్ లను నమోదు చేశామని చెప్పారు. ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు అశీష్ వర్మ, ధీరజ్ సాహు, అతుల్ ఆనంద్, మణిదీప్ సింగ్ సంధూ, క్రిషన్ కుమార్, రాజ్ కురమార్ శ్రీవాత్సవ, ఎం.ఎన్.కళ్యాణి, జాయింట్ కలెక్టర్ వాకాటి కరుణ, ఎస్పీ రమేష్ నాయుడు, డి.ఆర్.ఓ శ్రీరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్ కలిసి ఓట్ల లెక్కింపు నిర్వహించే ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
News Posted: 2 April, 2009
|