కొండా ఘనవిజయం
(వేముల సదానందం)
వరంగల్ : వరంగల్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలికి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కొండా మురళిధర్ రావు ఘన విజయం సాధించారు. స్థానిక సంస్థల శాసనమండలికి ఎన్నికైన డిసిసి అధ్యక్షులు గండ్రవెంకటరమణారెడ్డికి లాటరీలో రెండు సంవత్సరాలు పదవీ కాలం రావడంతో తిరిగి స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికలు జరిగాయి. మార్చి 30వ తేదీన జరిగిన ఈ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి డా.నర్సింగారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా సహకార బ్యాంక్ చైర్మన్ కొండ మురళీధర్లు తలడ్డారు. మొత్తం 887 ఓట్లు పోలవ్వగా కాంగ్రెస్ అభ్యర్థి కొండా మురళీధర్ రావుకు 530 ఓట్లు రాగా, టిడిపి అభ్యర్థికి 334 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థికి 9 ఓట్లు, మరో 14 ఎట్లు చెల్లకుండా పోయాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి కొండామురళీధర్ రావు 194 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు.
News Posted: 2 April, 2009
|