వరంగల్ : జిల్లాలోని నర్సం పేటలో పోలీసుల తనిఖీలలో అక్రమంగా నిల్వవుంచిన 10 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో తొలి విడత ఎన్నికల ప్రచారానికి తెర పడినా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నేతల ప్రయత్నాలు ఆగటం లేదు. అటువంటి వారి ప్రయత్నాలకు అడ్డుకునేందుకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో పై సంఘటన చోటు చేసుకుంది. టిడిపి అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి సోదరుడు వేమిడి శ్రీనివాస్ ఇంట్లో ఈ నగదు బయటపడినట్లు పోలీసులు తెలిపారు. ఆయనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.