వరంగల్ : వరంగల్ జిల్లా స్టేషన్ ఘన పూర్ వద్ద ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగడంతో రైలును నిలిపివేశారు. గుంటారు నుండి సికింద్రాబాద్ వస్తున్న ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లో ఈ ప్రమాదం సోమవారం సంభవించింది. ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లో మంటలు మంటలు రేగడంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో రైల్వే సిబ్బంది రైలును స్టేషన్ ఘన్ పూర్ వద్దే నిలిపి మరమ్మత్తులు చేశారు. అనంతరం రైలు యధావిధిగా బయలుదేరి వెళ్లింది.