వరంగల్ : వరంగల్ జిల్లాలో గూడ్స్ రైలు నిలిచిపోవడంతో రైళ్ల రాకపోకలు ఆలస్యమై ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాళ్ల పూసల పల్లి వద్ద విద్యుత్ తీగ తెగి ట్రాక్ పై పడడంతో అప్పుడే ఆ మార్గంలో వస్తున్న గూడ్స్ రైలు డ్రైవర్ గమనించి రైలును ఆపేయడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గూడ్స్ రైలుకు మరమత్తులు చేసేవరకు ఆ మార్గంలో పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది.