రోజూ లక్ష మందికి ఉపాధి
వరంగల్ : గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద రోజూ లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్నామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ అదనపు ప్రాజెక్టు డి.ఎస్.జగన్ తెలిపారు. మండుటెండల్లో కూలీల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను పరిశీలించడానికి ఎక్స్ పోజర్ విజిట్ ను ఏర్పాటు చేశారు. కలెక్టర్ జనార్థన్ రెడ్డి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారుల బృందాన్ని ఉపాధి పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు వెళ్ళాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో డి.ఎస్.జగన్ వివిధ శాఖల ప్రభుత్వాధికారులతో కలిసి హన్మకొండ మండలం తిమ్మాపూర్ ఎర్రకుంట వద్ద పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలకు సరైన సౌకర్యాలు కల్పించడంతో పాటు సకాలంలో డబ్బులు చెల్లిస్తే వారిలో విశ్వాసం పెరుగుతుందన్నారు. తద్వారా ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీల సంఖ్య పెరుగుతుందన్నారు. తిమ్మాపూర్ ఎర్ర కుంట వద్ద జరుగుతున్న పూడికతీత, ఆయకట్టు అభివృద్ధి పనులకు హదిహేను గ్రూపులకు చెందిన కూలీలు పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. ఈ పర్యటనలో జడ్పీ సీఈవో సుధాకర్ రావు, ఎంపీడీఓ శ్రీనివాస్, సర్పంచ్ సదానందం స్మార్ట్ ప్రతినిధి, ఏడీ గ్రౌండ్ వాటర్ వీరసోమయ్య తదిదరులు పాల్గొన్నారు.
News Posted: 14 May, 2009
|