వరంగల్ : జిల్లాలో అతిసారం ప్రబలింది. భూపాల పల్లి మండలం బెద్దల పల్లిలో కలుషిత నీరు తాగి సుమారు 50 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని మండలంలోని ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో చికిత్స కోసం చేర్పించారు. కాగా అక్కడ వైద్య సిబ్బంది తగినంత లేకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.