వరంగల్ : వరంగల్ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 గాయపడ్డారు. తాడ్వాయి మండలం కొండవర్తి వద్ద బస్సును లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారు. కాగా వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.