ఆర్ధిక సర్వేకి ఉపా బ్రేక్
న్యూఢిల్లీః ఎన్నికల తరుణంలో ఆర్ధిక సర్వేని నిర్వహించరాదని ఉపా ప్రభుత్వం నిర్ణయించుకుంది. ప్రపంచ ఆర్ధిక సంక్షోభ ప్రతికూల ప్రభావం కారణంగా దేశ ఆర్ధిక సర్వే ఫలితాలు ఏమంత ఆశాజనకంగా ఉండవు. దాంతో ఎన్నికల ముందు ఇలాంటి ఆర్ధిక సర్వేలు ఉపా సంకీర్ణం కొంప ముంచే అవకాశముందని ప్రభుత్వం భావించింది ఆర్ధిక సర్వేని ఎగ్గొట్టింది. ఐఎమ్ ఎఫ్ సైతం ఈ ఏడాది ప్రపంచ ఆర్ధిక సర్వేని నిలిపివేసిన సంగతి తెలిసిందే.
భారత స్తూల దేశీయోత్పత్తి దాదాపు 2 శాతానికి దిగజారినట్లు కేంద్ర గణాంక సంస్థ (సిఎస్ ఓ) సోమవారంనాడు ప్రకటించింది. 2007-08 ఆర్దిక సంవత్సరంలో 9 శాతంగా ఉన్న వృద్ది రేటు ఆరేళ్లనాటి అతి తక్కువ స్థాయి 7.1 శాతానికి క్షీణించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఏప్రిల్-మే నెలల్లో నిర్వహించాల్సిన ఆర్ధిక సర్వే ఫలితాలు అత్యంత ఉదాసీనంగా ఉండడంతో ఏన్నికల ముందు ఉపా సంకీర్ణాన్ని ఇబ్బందిపెడతాయి.రిట్రంచ్ మెంట్, జీతాల కోతలతో ఉదాసీనంగా ఉండూబోతున్న ఆర్దిక సర్వేని ఉపా ప్రభుత్వం నిలిపేసింది.
అయితే అధికారికంగా మధ్యంతర బడ్జెట్ లేదా ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టేముందు ఆనవాయితీగా ఆర్ధిక సర్వే జరపాల్సిన అవసరం లేదు. ఇప్పటిదాకా ప్రభుత్వం ఈ విధానాన్నే అనుసరిస్తోందని అర్ధిక మంత్రిత్వ శాఖ చీఫ్ ఎకానిక్ అడైజర్ అరవింద వీరమణి తెలిపారు.ఉపా ప్రభుత్వం ప్రవేశపెట్టే ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ పై కూడా ప్రతి పక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఉపా ప్రభుత్వం ఇప్పటికే అయిదు పూర్రి స్థాయి బడ్జెట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
Pages: 1 -2- -3- News Posted: 10 February, 2009
|