డబుల్ సిమ్ పై రామబాణం!
న్యూఢిల్లీ : మొబైల్ ప్రపంచంలో తాను అలజడి రేపినప్పటికీ సోమసుందరం రామకుమార్ కించిత్ కూడా ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. జంట-సిమ్ కార్డ్ టెక్నాలజీకి సంబంధించి భారతీయ పేటెంట్ పొందిన 36 సంవత్సరాల రామకుమార్ చైనా నుంచి డబుల్ సిమ్ కలిగిన హ్యాండ్ సెట్ల దిగుమతులను నిలిపివేసేట్లుగా కస్టమ్స్ శాఖను పురికొల్పగలిగారు. (తనకు తగిలించిన 'స్వతంత్ర శోధకుడు' అనే బిరుదును ఆయన పట్టించుకోవడం లేదు). అనేక కన్సైన్ మెంట్లను తొక్కిపెట్టారు. దీనితో ఉత్పత్తి సంస్థలు, దిగుమతి సంస్థలలో కనీసం ఒకటైనా కోర్టును ఆశ్రయించింది.
మితభాషి అయిన రామకుమార్ తాను చేస్తున్నదల్లా తన పేటెంట్ హక్కులను వినియోగించుకోవడమేనని, ఈ ప్రక్రియలో దిగుమతిదారుల నుంచి తనకు బెదరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్పారు. 'కాని నేనేమీ భయపడడం లేదు' అని ఆయన చెప్పారు. మీడియా ప్రచారానికి దూరంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకు కారణాలు లేకపోలేదు. దేశంలోకి డ్యుయెల్-సిమ్ హ్యాండ్ సెట్ల దిగుమతులను, విక్రయాలను స్తంభింపచేయగల శక్తి ఆయనకు ఉంది.
తన పేటెంట్ హక్కులను వినియోగించుకునే యత్నంలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పట్టభద్రుడైన రామకుమార్ ఇప్పటికే కొంత విజయం సాధించారు. స్పైస్ మొబైల్ దిగుమతి చేసుకున్న రూ. 95 లక్షలు విలువ చేసే డ్యుయెల్-సిమ్ హ్యాండ్ సెట్లను ఢిల్లీ విమానాశ్రయంలో నొక్కిపెట్టేశారు. చెన్నై, ముంబై విమానాశ్రయాలలో కూడా రెండు కన్సైన్ మెంట్ల విడుదలకు అనుమతి ఇవ్వలేదు.ఇక వివిధ ఎంట్రీ కేంద్రాలలో మరిన్ని కన్సైన్ మెంట్లను నిలిపివేశారు.
Pages: 1 -2- -3- News Posted: 16 March, 2009
|