ప్రతి ద్రవ్యోల్బణం లాభసాటే
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం బ్లడ్ షుగర్ లాంటిది. రక్తంలో ఒక స్థాయిలో చక్కెర ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉన్నట్లు ద్రవ్యోల్బణ రేటు కూడా ఒక స్థాయిలో ఉంటేనే సామాజికార్ధిక వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉంటుంది. బ్లడ్ షుగర్ స్థాయిలు అధికమైనా, తక్కువైనా అనారోగ్యమైనట్లే ద్రవ్యోల్బణం స్థాయి పెరిగినా, గణనీయంగా తగ్గిపోయి ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడినా ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు. అయితే మార్చి 9 వారాంతానికి వార్షిక ద్రవ్యోల్బణం 0..4 శాతం అత్యల్ప స్థాయికి ద్రవ్యోల్బణం చేరడంతో ప్రతి ద్రవ్యోల్బణ ప్రమాదం వస్తుందని పలువురు ఆర్దికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఏది ఎటు మారినా సామాన్యులకే బొక్క.
'మంచి కరువును అందరూ ఇష్టపడతారు' అన్నట్లుగా ద్రవ్యోల్బణం భరించలేనంతగా పెరిగినప్పటికీ, తరిగినప్పటికీ కొందరు ఘరానాలు సొమ్ము చేసుకోగల్గుతారు. సామాన్యులు మాత్రం బాధితులుగా మిగులుతారు. హైఎండ్ వినియోగదారులు, పొదుపు దారులకు ఈ ప్రతి ద్రవ్యోల్బణం వరంగా పరిణమించనుంది. రుణ గ్రహీతలకు ఇది సుభ వార్తగా మారింది. తాజా రుణాలు చాలా చౌకగా లభిస్తాయి. అయితే గతంలో తీసుకున్న రుణాలకు చెల్లించే స్థిర వాయిదాల విలువ అధికమవుతుంది. అదే సమయంలో ప్రతి ద్రవ్యోల్బణం ఉత్పత్తిదారులకు అశనిపాతంగా మారుతుంది. ఆయిల్, మెటల్, సిమెంట్, ఆటోమొబైల్ రంగాలు గతంలో సాధించిన లాభాలు ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్తితుల్లో క్షీణిస్తున్నాయి.
పలు రంగాల ఉత్పత్తుల ధరలు తగ్గడంతో ఉత్పత్తి విస్తరణ కార్యక్రమాలు కుంటుపడటమే కాదు, సగటు ఉత్పత్తి సైతం కుంటుపడింది. ద్రవ్యోల్బణం అవసవ్యదిశలోకి మళ్లితే, ధరలు పెరగడం నిలిచిపోతాయి. వాస్తవంలో ధరలు పడిపోతాయి. ఆర్దికవేత్తలు ఈ పరిస్థితిని ప్రతిద్రవ్యోల్బణంగా పిలుస్తారు. ఊహించిన దానికంటే ముందుగానే ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు దేశంలో నెలకొంటున్నాయి. మైనస్ స్థాయికి వెళ్లే ద్రవ్యోల్బణం అయిదారు నెలలపాటు కొనసాతుందని కొంత మంది విశ్లేషకుల అంచనా. వచ్చే నెలలో ద్రవ్యోల్బణం మైనస్ స్థాయిలకు చేరుకుంటుందని, మే-జూన్ మాసాల వరకు ఈ పరిస్థితి కొనసాగగలదని ప్రధాని ఆర్దిక సలహా మండలి సభ్యుడు సౌమిత్ర చౌదరి తెలిపారు. ప్రతి ద్రవ్యోల్బణం కనీసం ఆరు నెలలపాటు కొనసాగగలదని హెచ్డిఎఫ్సి బ్యాంక్ చీఫ్ ఎకానమిస్ట్ అభిక్ బారువా తెలిపారు.
Pages: 1 -2- -3- News Posted: 20 March, 2009
|