ట్రెజరీ షేర్లు అమ్మిన రిల్
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్ - రిల్) ఈ నెలలో రెండవ సారి రూ. 2465 కోట్లు సమీకరించేందుకై సుమారు 33 మిలియన్ల ట్రెజరీ షేర్లను సోమవారం విక్రయించింది. మార్కెట్ విలువ ప్రకారం దేశంలో అత్యంత భారీ సంస్థ అయిన ఆర్ఐఎల్ అత్యవసర మదుపు కోసం కచ్చితంగా నగదును సిద్ధం చేసుకుంటున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. లయండెల్ బాసెల్ ఆఫర్ ధర చెల్లించేందుకు లేదా ఇతర కొనుగోళ్ల కోసం నిధులను సంస్థ సమీకరిస్తున్నది.
మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇవాన్ పలాషియోస్ అభిప్రాయం ప్రకారం, ఆర్ఐఎల్ వద్ద సోమవారం వాటాల అమ్మకం అనంతరం దాదాపు 6.5 బిలియన్ డాలర్లు విలువ చేసే ట్రెజరీ షేర్లు,సుమారు 4.5 బిలియన్ డాలర్ల నగదు ఉన్నాయి. ఈ షేర్లను ఒక్కొక్కటి రూ. 1050 రేటుకు అమ్మారు. జనవరి 8 నాటి ముగింపు ధర కన్నా ఇది 4.8 శాతం తక్కువ.
'లయండెల్ బాసెల్ కొనుగోలుకు, మధ్యలో వచ్చే ఇతర కీలకమైన కొనుగోళ్ల కోసం ఈ నిధులను సంస్థ ఉపయోగించవచ్చుని మూడీస్ భావిస్తున్నది' అని పలాషియోస్ తెలిపారు. 'విలువను బట్టి చూస్తే ఈ అమ్మకం సరైనదైతే ఈ షేర్ విలువ 20 శాతం నుంచి 30 శాతం వరకు పెరిగి ఉండాలి. కాని ఇది సుమారు 5 శాతం మేర పడిపోయింది. అంటే మార్కెట్ లో ఇప్పటికే ఈ అమ్మకాలు తగ్గాయన్నమాట' అని ఏంజెల్ బ్రోకింగ్ సంస్థలో సీనియర్ ఆయిల్, గ్యాస్ అనలిస్ట్ దీపక్ పారీక్ వ్యాఖ్యానించారు.
సెన్సెక్స్ లో 0.1 శాతం పతనంతో పోలిస్తే ఆర్ఐఎల్ వాటా విలువ సోమవారం రెండు శాతం అంటే రూ. 1081.5 స్థాయికి పడిపోయింది. 1:1 బోనస్ ఇష్యూ కోసం సర్దుబాటు చేసిన ఆర్ఐఎల్ షేర్ల విలువ నవంబర్ 23న లయండెల్ బాసెల్ ఆఫర్ ధ్రువీకరణ అధికారికంగా జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు 2.09 శాతం మేర పడిపోయింది. ఆర్ఐఎల్ పెద్ద భాగస్వామిగా ఉన్న సెన్సెక్స్ ఇదే కాలంలో 2.01 శాతం మేర లాభం ఆర్జించింది. 2010 జనవరి 4న 25.8 మిలియన్ షేర్ల విక్రయానంతరం సోమవారం ఈ ట్రెజరీ షేర్ల విక్రయం జరిగింది. ఇంతకుముందు 2009 సెప్టెంబర్ లో 15 మిలియన్ షేర్ల అమ్మకం జరిగింది. మొత్తం సంస్థ ట్రెజరీ షేర్ల విక్రయం ద్వారా రూ. 9300 కోట్లు సమీకరించింది.
Pages: 1 -2- -3- News Posted: 12 January, 2010
|