| ధీటుగా దేశీయ సెల్ ఫోన్లున్యూఢిల్లీ : ఒకప్పుడు సాధారణ  మొబైల్ చేతిలో ఉండటమే గొప్ప.  ఆ తరువాత లేటెస్ట్ మోడల్  చేతిలో ఉండటం గొప్ప. ఈ లేటెస్ట్ మోడల్ ఫోన్ లు ఉన్నత వర్గాలకు చెందిన వారి దగ్గరే ఉండేవి. కానీ కాలం మారింది.  ఆర్ధిక పరిస్థితులతో సంబంధం లేకుండా అందరి దగ్గరా లేటెస్ట్ మెడల్సే.  ప్రతీ మొబైల్ లోనూ టచ్ స్ర్కీన్, డ్యుయల్ సిమ్, బ్యాటరీ బ్యాకప్, కలర్ డిస్ ప్లే, విఫి సపోర్టు వంటి అధునాతన ఫీచర్లు దర్శనమిస్తున్నాయి. వేలాది రూపాయలు ఖర్చు చేసి ఈ లేటెస్ట్ మోడళ్ల ఫోన్లను కొనుగోలు చేసేందుకు భారతీయుల ఆర్ధిక శక్తి  ఏ మాత్రం పెరగలేదు. మరి అధునాతన ఫోన్లు  అందుబాటులోకి రావడం వెనుక అద్భుత శక్తులేవీ లేవు.
 
 బ్రాండెడ్ ఫోన్ లను తలదన్నేలా  దేశీయ బ్రాండ్లు మార్కెట్ లోకి వరదలా వెల్లువెత్తడమే ఇందుకు కారణం. వేలాది రూపాయలు విలువ చేసే నోకియా, శ్యామ్ సంగ్ బ్రాండ్ లకు ధీటుగా దేశీయ బ్రాండ్ లు కూడా  వినియోగదారులను ఆకర్షించే ఫీచర్ లు గల ఫోన్ లను తక్కువ ఖరీదుతో  ప్రవేశపెట్టి సవాల్ ను విసిరాయి. దీంతో భారతీయ  మొబైల్ మార్కెట్ లో బ్రాండెడ్ కంటే దేశీయ మొబైల్ మార్కెటే అతి పెద్దదిగా ఆవిర్భవిస్తోంది. మైక్రో మ్యాక్స్,  స్పైస్, ఇంటెక్స్, ఒనిడా, వంటి దేశీయ బ్రాండ్ లు వినియెగదారులను ఆకర్షిస్తూ మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. నోకియా, శ్యామ్ సంగ్ వంటి కంపెనీలకు చెందిన ఫోన్ సుమారు 10వేల రూపాయలు పైన విక్రయిస్తుంటే, ఆవే ఫీఛర్ లతో  ఈ కంపెనీలు ఫోన్ లను కేవలం 4000-5000 రూపాయలకే అమ్మకం చేసి మార్కెట్ మాయాజాలం చేస్తున్నాయి.
 
 మైక్రో మ్యాక్స్ కంపెనీ కలర్ డిస్ ప్లే, డ్యూయల్ సిమ్, లాంగ్ బ్యాటరీ బ్యాకప్, బ్లూటూత్, ఎంపీ3, వంటి ఫీచర్ల ఫోన్ లను కేవలం మూడు వేల రూపాయలకే విక్రయిస్తోంది. ఈ మేరకు xli, xlu, x250 వంటి మోడళ్లను రూపొందించి విక్రయిస్తోంది. అలాగే స్మార్ట ఫోన్ ల క్యాటగిరీలో వెబ్ బ్రౌజర్ వంటి వసతులతో సిడిఎంఎ, జిఎస్ఎం సౌలభ్యంతో  GC 700 వంటి మెడళ్లను మార్కెట్ లోకి దింపి బ్రాండెడ్ కంపెనీలకు సవాల్ విసిరింది. ఈ వసతులు గల ఫోన్ లను బ్రాండెడ్ కంపెనీలు 25000- 30000 మధ్య విక్రయిస్తుంటే మైక్రో మ్యాక్స్ కేవలం 14 వేల రూపాయలకే అందచేస్తోంది.
 
 
 
 Pages:   1   -2-   -3-    
 News Posted: 26 January, 2010
 
 
 
 
 
 |