ఆవు పంచితంతో 'కోలా'!
డెహ్రాడూన్: కోలా కంపెనీలకు దడ పుట్టించే వార్త ఇది. రంగు నీళ్ళతో ప్రజల జేబుల్ని, ఆరోగ్యాన్ని కొల్లగొడుతున్న కోలా కంపెనీల ఆటలకు చెక్ పెట్టేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్) ఒక వినూత్నమైన ఆలోచనను ఆచరణలో పెట్టబోతోంది. అదే ఆవు పంచితం(మూత్రం)తో సాఫ్ట్ డ్రింక్ తయారు చేసేందుకు స్వీకారం చుట్టబోతోంది. ఆవు పంచితం ఒక మూలకంగా వినియోగించే ఈ సాఫ్ట్ డ్రింక్ మార్కెట్ ను స్వీప్ చేస్తుందని సంఘ్ అనుబంధ విభాగమైన గోరక్షక సమితి గట్టిగా నమ్ముతోంది.
హరద్వార్ లోని గోరక్షక సమితి విభాగం అధితపతి ఓం ప్రకాష్ మాట్లాడుతూ, గోవు మూత్రాన్ని గోవు పంచితంగా అభివర్ణిస్తుంటాం. ఇందులో అనేక వ్యాధులను నయం చేసే గుణాలున్నాయి. అందుకే ఆవు పంచితం మూలకంగా వినియోగిస్తూ మేము ఒక సాఫ్ట్ డ్రింక్ ఫార్ములాను తయారు చేశాం. ప్రస్తుతం ఈ ఫార్ములాను టెస్టింగ్ కోసం లక్నోలోని ఒక లాబొరేటరీకి పంపించాం. టెస్టల ఫలితాలు అనుకూలంగా వస్తే అప్పుడు ఈ సాఫ్ట్ డ్రింక్ ప్యాకేజి, స్టోరేజి, మార్కెటింగ్ వంటి విషయాలపై దృష్టి సారిస్తాం' అని చెప్పారు.
ఈ సాఫ్ట్ డ్రింక్ ఫార్ములాను రూపొంచడానికి జరిగిన పరిశోధనలన్నింటికీ సంఘ్ ఆర్థిక సహాయం సమకూర్చింది. అయితే ఈ డ్రింక్ మార్కెట్లోకి తీసుకు వెళ్ళడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం సహాయం తీసుకోవాలనుకుంటున్నట్లు గోరక్షణ సమితి భావిస్తోంది. 'ఆవు పంచితంతో తయారైన డ్రింక్ మార్కెట్లోకి ప్రవేశిస్తే అది కొత్త ప్రభంజనం సృష్టించడం ఖాయం. ఇప్పటికే అనేక వ్యాధులకు దివ్యమైన ఔషధంగా ఆవు పంచితం వినియోగం పెరుగుతూ వస్తోంది. ఇది కూల్ డ్రింక్ రూపంలో మార్కెట్లోకి వస్తే దానికి ఏర్పడే డిమాండ్ అంతా ఇంతా కాదు' అని ఓం ప్రకాష్ ధీమాగా చెప్పారు.
Pages: 1 -2- News Posted: 10 February, 2009
|