మన కోపమే మన మృత్యువు
చికాగో: 'తన కోపమే తన శత్రువు' అన్న నానుడిని మరోసారి శాస్త్రీయంగా ఒక అధ్యయనం రుజువు చేసింది. అయితే ఈ అధ్యయనంలో శత్రువు మృత్యురూపంలో వెల్లడయ్యింది. కోపంతో సహా పలు ఉద్వేగాలు సదరు వ్యక్తుల్లో ప్రాణాంతక హృదయ స్పందనలను కలగించే అవకాశమున్నట్లు అమెరికా పరిశోధకలు సోమవారంనాడు తెలిపారు. భూకంపాలు, యుద్ధాలు లేదా వరల్డ కప్ సాకర్ లో ఘోర పరాజయంలాంటి వైపరీత్యాల కారణంగా కొందరికి గుండెపోటు వచ్చి మరణించారు. ఇలాంటి సందర్భాల్లో సదరు బలహీనమైన వ్యక్తుల గుండె రక్త సరఫరా చేయడాన్ని నిలిపేస్తుంది. అలాంటి అకాల మరణాలను మనం తరచు వింటూనే ఉంటాము. ఇలాంటి విషయాలపై గతంలో పలు అధ్యయనాలు జరిగిన విషయం తెలిసిందే.
'ఒక దేశంలోని ప్రజానీకాన్ని ఉన్నట్లుండి తీవ్ర వత్తడికి గురిచేసినట్లయితే ఆకశ్మిక మరణాలు సంభివిస్తాయని పలు అధ్యయనాల్లో రుజువైనాయి. గుండెకు సంబంధించిన విద్యుత్ వ్యవస్థ ఈ సందర్భంలో ఎలా దెబ్బతింటుందన్న విషయంపై మేము అధ్యయనం చేశాము' అని కనెకటికట్ యేల్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు డాక్టర్ రాచెల్ లంపెర్ట్ తెలిపారు. ఇందుకుగాను ఆమె బృందం 62 మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నవారిని అధ్యయనం చేసింది. ఈ అధ్యయనానికి ఎంపికైన వారంతా గుండె సంబధిత బలహీనతలు గలవారే. అధ్యయనానికి ఎంపికైన వారికి కోపం తెప్పించే ఉదంతాన్ని వారికి తెలియజేసి వారి ప్రతిస్పందనలను, హృదయ రుగ్మతలను ఈ బృందం పరిశీలించింది. గుండెలోని విద్యుత్ పరమైన లోపాలను టి-వేవ్ అల్టెర్నాన్స్ ద్వారా అంచనా వేసింది. కోపం వారి గుండెలో విద్యుత్ పరమైన అస్తిరత్వాన్ని కలిగించిందని ఆ పరిశోధక బృందం వెల్లడించింది.
Pages: 1 -2- News Posted: 24 February, 2009
|