ఊబకాయం ప్రాణాంతకం
లండన్: ఊబకాయం అనారోగ్యమే కాదు, రోజుకు పది సిగిరెట్లు తాగేవారికున్నంత ప్రాణాంతకమైనది కూడా. ఊబకాయంతో బాధపడే టీనేజర్లలో అకాల మరణాలు సంభవించే ప్రమాదముందని తాజా అధ్యయనం తెలియజేసింది. ఆధునిక సమాజానికి ఊబకాయ సమస్య పెను సవాలుగా నిలిచింది. ముఖ్యంగా ప్రపంచ పట్టణవాసులకు, నగరవాసులకు ఈ సమస్య ఒక పెను సవాలుగా నిలిచింది. నాగరికత పెరిగే కొద్దీ శ్రమ సంస్కృతికి ప్రజలు దూరమవుతున్నారు. ఫలితంగా ఆహారం ద్వారా శరీరంలోకి చేరుతున్న కేలరీలను అన్ని అవయవాలు సమానంగా ఖర్చు చేయలేక పోవడంతోను, నిత్యం జీవితంలో భాగమైన ఉద్వేగం కారణంగా శరీరంలో చోటుచేసుకున్న హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడంతో ప్రజలు ఊబకాయ రుగ్మత బారిన పడుతున్నారు. జీవన శైలి మారడం వలన తలెత్తిన సమస్యకు డైటింగులు, మందులు పరిష్కారం కాదు. వీటివల్ల మరో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి.
తీవ్ర ధూమపాన ప్రియులకు ప్రాణాపాయం ఊబకాయులకు కూడా ఉన్నట్లు బిట్రిష్ మెడికల్ జర్నల్ అధ్యయనం తెలిపింది. స్వీడన్ లో నిర్భంధ సైనిక వైద్య పరీక్షల్ని దాదాపు 45 వేల మంది పురుషులపై నిర్వహించారు. ఈ అధ్యయనాన్ని నిర్వహించిన బృందానికి సారధ్యం వహించిన స్వీడన్ కరోలింస్కా ఇన్ స్టిట్యూట్ డాక్టర్ మార్టిన్ నియోవియస్ పై నిర్ధారణకు వచ్చినట్లు బ్రిటిష్ మెడికల్ జర్నల్ తెలిపింది. ఈ అధ్యయనానికి ఎంపిక చేసినవారి బాడీ మాస్ ఇండెక్స్ (బిఎమ్ఎస్)ను గణించారు. 18 ఏళ్ల వయసులో వారి స్మోకింగ్ అలవాటును అంచనా వేశారు. 38 ఏళ్ల వయసు వచ్చేంత వరకు వారి శారీరక ఆరోగ్యాన్ని క్రమంగా అంచనా వేశారు. చాలా ఏళ్లపాటు దాదాపు 17 లక్షల మంది ఆరోగ్యం, మరణాల మధ్య సంబంధాలను ఈ అధ్యయనం పరిశీలించింది. ఈ అధ్యయనంలో దాదాపు 2,897 మంది మరణించారు.
Pages: 1 -2- News Posted: 26 February, 2009
|