పెళ్ళి పందిట్లో మాంద్యం!
హైదరాబాద్: ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఆర్థిక మాంద్యం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. వ్యాపారాలు, వాణిజ్య కార్యకలపాలు కుంటుపడిపోయాయి. ఏ కంపెనీ ఫలితాలు చూసినా నష్టాలు, తిరోగమమే కనిపిస్తోంది. వేలు, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఉన్న పళంగా ఊడిపోతున్నాయి. ఇంతటి సంక్లిష్ట సమయంలో వివాహం చేసుకుంటున్నారా? ఇలా అడుగుతున్నందుకు కోపగించుకోకండి. అత్యంత ఆడంబరంగా వివాహమహోత్సవాలు జరుపుకోవడానికి అలవాటు పడిన భారతీయులు ఈ విషయంలో రాజీ పడలేరు. హైదరాబాద్ లోని జంటలు ఇదే విషయాన్ని నిరూపిస్తున్నారు. అయితే, కొన్ని విషయాలలలో మాత్రం సర్దుకుపోతున్నారు.
ఈవెంట్ మేనేజర్లు, వెడ్డింగ్ ప్లానర్ల సేవలను ఉపయోగించుకోవడమనేది ప్రస్తుతానికి ఆగిపోయింది. వివాహం ఖర్చులను తగ్గించుకోవడానికి పూర్వపు రోజులలో వలె కుటుంబ సభ్యులు, మిత్రుల సాయాన్ని అర్థించడమే మేలని వారు భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పెళ్ళి ఖర్చులను తగ్గించుకొన్నట్లూ కాగలదు. మరీ ఆర్భాటంగా కాకపోయినా కొంత వైభవోపేతంగానే పెళ్లి వేడుకలు జరుపుకుంటున్నారు.
'శుభలేఖలకు ఎక్కువ ఖర్చవుతుంది. మా తాతగార్లు, అమ్మమ్మ, నాయనమ్మ, మా కుటుంబంలోని పెద్దల కోసం మాత్రం ఏవో కొద్దిగా కార్డులు ప్రింట్ చేయించాం. కాని ఖర్చులు తగ్గించుకోవడానికి మిగిలినవారి కోసం ఇ-ఆహ్వానానికి లింక్ పంపాం' అని అమెజాన్ ఉద్యోగిని, 'బడ్జెట్ వధువు' మాధురీ సంఘి తెలియజేసింది. 'నేను నా మిత్రులు, కుటుంబ సభ్యులకు వారి మెయిల్స్ పై లింక్ పంపాను. అది నా వివాహపు సైట్ కు మార్గం చూపుతుంది. నా కోసం నా వెబ్ డిజైనర్ స్నేహితులు ఈ సైట్ ను సృష్టించారు. నేను సింగపూర్ లో వివాహం చేసుకుంటున్నందున సింగపూర్ నగర నేపథ్యంలో నేను, నా కాబోయే భర్త కారికేచర్లు ఈ సైట్ లో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ ఆలోచనను మెచ్చుకున్నారు. దీని గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. శుభలేఖలపై ఖర్చును తగ్గించుకున్నందున నాకూ సంతోషంగానే ఉంది' అని ఆమె చెప్పింది.
Pages: 1 -2- News Posted: 2 March, 2009
|