షుగర్ మందుల దుర్వినియోగం
ముంబై: ప్రపంచంలో ఏడాదికి 21 బిలియన్ డాలర్ల విలువైన డయాబెటిస్ మందులు ఖర్చవుతున్నాయని మందుల పరిశ్రమ అంచనా వేసింది. భారత దేశంలో 2007న 430 మిలియన్ డాలర్ల విలువైన మందుల వాడకం జరిగింది. ఏడాదికి ఈ ఖర్చు 16-20 శాతంగా పెరుగుతున్నట్లు ఆ అంచనా పేర్కొంది. మధుమేహం జీవనశైలి రుగ్మతల్లో అత్యంత ప్రముఖమైనది. అయితే డయాబెటిక్స్ మార్కెట్లో ఆఫ్-లేబుల్ మందుల వాడకమనే ఒక అనారోగ్యకరమైన ధోరణి ప్రబలింది. ఇన్సులిన్ తో సహా, పలు డయాబెటిక్ మందుల్ని అకారణంగా యధేచ్ఛగా వాడుతున్నారు. ఆఫ్ లేబుల్ మందులంటే, ఆ మందు ఉత్పత్తిదారుని అభీష్టానికి వ్యతిరేకంగా ఎలాంటి క్లీనికల్ పరీక్షల్ని నిర్వహించని కంపెనీ మందుల్ని వాడడమని అర్ధం.
మెట్ ఫార్మిన్
ఇన్సులిన్, మెట్ ఫార్మిన్, రెపాగ్లినైడ్ లాంటి దాని ఉత్పత్తిదారుడు క్లీనికల్ గా నిరూపించని పలు రకాల డయాబెటిక్ మందుల్ని భారత దేశంలో చాలా మంది యధేచ్ఛగా వాడుతున్నారు. దేశంలో టైప్ 2 డయోబెటిస్ నివారణ కోసం వినియోగిస్తున్న మెట్ ఫార్మిన్ మందు లోని 5-10 శాతం అకారణంగా వాడుతున్నారని అపోలో హాస్పిటల్ సీనియర్ ఎండోక్రినాలజిస్ట్ ఎస్ కె వాంగ్నూ తెలిపారు. మెట్ ఫార్మిన్ మందు ద్వారా బరువు కూడా తగ్గుతుంది. దాంతో చాలా మంది ఈ పిల్ ను బరువు తగ్గించే మందుగా వినియోగిస్తున్నారు. కొంత మంది ఊయకాయులుగా ఉన్న డయాబెటిస్ రోగులు ఈ మందును అధిక మోతాదులో వినియోగిస్తున్నారు.
ఇన్సులిన్-
అదే విధంగా ఇన్సులిన్ ద్వారా బరువు పెరిగే అవకాశముంది. కొంతమంది బరువు పెరిగేందుకు ఇన్సులిన్ ను అనవసరంగా వాడుతున్నారు. దేశంలోని ఇన్సులిన్ వాడకంలో 2 శాతం బరువు పెరిగేందుకు వినియోగిస్తున్నారు. ఇలా అతిగా మదుమేహ మందులను వినియోగిస్తే హైపోగ్లైసీమియా లేదా రక్తంలో షుగర్ తగ్గిపోవడానికి దారితీస్తుంది. దాంతో ప్రకోపం, సీజర్స్ (మూర్ఛ లాంటిది), కోమా, చివరికి మరణం కూడా సంభవించవచ్చు. మెట్ ఫార్మిన్ ను అధికంగా వాడితే వాంతి, కడుపులో వికారం లాంటి రుగ్మతలు వస్తాయి.
Pages: 1 -2- News Posted: 5 March, 2009
|