జీతం ఇస్తేనే సంసారం!
తిరువనంతపురం : 'భగవంతుని భూమి' గా పరిగణించే కేరళలో అసోసియేషన్లకు గాని, కార్మిక సంఘాలకు గాని కొదువ లేదు. చివరకు మద్యపాన ప్రియులకు కూడా ఒక సంఘం ఉన్నది. అయితే, ఈ సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా కొత్త సంఘం ఒకటి ఏర్పడింది. గృహిణులకు వేతనాలు కోరుతున్న ఈ సంఘం తక్కిన సంఘాలకు భిన్నమైనది.
'నోరు లేని, జీతం రాని' మహిళలను సంఘటితం చేసేందుకు ఉత్తర వయనాడ్ లో మహిళలు కొందరు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వంటింటిలో కష్టపడే, ఇతర గృహ సేవలలో నిమగ్నమయ్యే మహిళలకు వేతనాల విధానాన్ని ప్రవేశపెట్టాలని ఈ సంఘం కోరుతున్నది. ఇంకా నామకరణం జరగని ఈ సంఘం స్వల్ప స్థాయిలో ప్రారంభమైంది. కాని వృద్ధికి సంబంధించి ఆశావహమైన ప్రణాళికలే ఈ సంఘానికి ఉన్నాయి.
Pages: 1 -2- News Posted: 9 March, 2009
|