'మొబైల్' మేనర్స్ ఏది?
న్యూఢిల్లీ: ఇండియాలో 36.23 కోట్ల మంది సెల్ ఫోన్ వినియోగదారులు ఉన్నారు. ఈ సంఖ్య రోజురోజుకి లక్షలలో పెరిగిపోతోంది. మరో కొన్ని సంవత్సరాలలో మొబైల్ ఫోన్ మార్కెట్ దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాలకు కూడా విస్తరించబోతున్నది. మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య కోట్లు దాటిపోతున్నా దానిని వినియోగించే వారిలో ప్రాథమికమైన సెల్ ఫోన్ మర్యాదలే కరవవుతున్నాయని పార్లమెంటరీ బృందం ఒకటి అభిప్రాయపడింది.
సంతాప సభలలోను, ఉపన్యాసాలు జరుగుతున్నప్పుడు, సినిమా హాళ్ళలోను మొబైల్ ఫోన్లు రింగ్ అవడం సెల్ ఫోన్ మర్యాదలు ఎలా లుప్తమయ్యాయో సూచిస్తుంటుంది. విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు, ఇతర బహిరంగ ప్రదేశాలలో మొబైల్ ఫోన్ల వాడకంపై సమంజసమైన ఆంక్షలను విధించాలని అభ్యర్థిస్తూ పంజాబ్ పటియాలా వాసి గుర్జీత్ సింగ్ దాఖలు చేసిన ఒక పిటిషన్ ను పురస్కరించుకుని పిటిషన్ల కమిటీ ఈ అభిప్రాయాలు వెలిబుచ్చింది.
Pages: 1 -2- News Posted: 10 March, 2009
|