సగం మంది బాల వధువులే!
న్యూఢిల్లీ: బాల్య వివాహాలను రద్దు చేస్తూ 1929 లో చట్టం వచ్చింది. అయితే చట్టం చేసి 80 ఏళ్ల తర్వాత కూడా ఆ దురాచారం మనల్ని వదలిపోలేదు. ఆడవాళ్లకు కనీసం 18 ఏళ్లు వయసు వచ్చేంతవరకు వివాహం చేయకూడదన్న బాల్య వివాహాల నిషేధపు చట్టం దేశంలో అమలు కావడం లేదు. దేశంలో జరుగుతున్న పెళ్లిళ్లలోని వధువుల్లో సగం మంది మైనారటీ తీరని బాలికలేనని ఇండో-అమెరికన్ అధ్యయనాన్ని 'లాన్ సెట్' వైద్య పత్రిక మంగళవారంనాడు ప్రచురించింది.
20-24 ఏళ్ల వయసులోని 22,807 మంది ఆడవాళ్లను ఈ అధ్యనానికి ఎంపిక చేశారు. వారిలో దాదాపు 44.5 శాతం మందికి 18 ఏళ్ల లోపే వివాహం జరిగినట్లు ఈ సర్వేలో వెల్లడైంది. భారత దేశంలో బాల్య వివాహాల చట్టం విఫలమైందని బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త (బియుఎస్పిహెచ్) లోని సమాజిక, ప్రవర్తనా విజ్ఞాన శాస్త్ర శాఖలోని పరిశోధకులు వెల్లడించారు. అందువల్ల బహుళ అవాంఛిత గర్భాలు, వాటి నిర్మూలన, స్టెరిలైజేషన్ల సంఖ్య బాగా పెరిగిపోయాయని ఆ పరిశోధకుల తెలిపారు. దాంతో 24 నెలల్లోనే అవాంఛిత, అర్ధాంతరంగా కోల్పోయిన గర్భాల సంఖ్య మరీ పెరిగిపోయాయి. అదే సమయంలో శిశు జననాలు కూడా పెరిగిపోయినట్లు ఆ అధ్యయనం తెలిపింది.
Pages: 1 -2- News Posted: 11 March, 2009
|