త్వరలో స్క్రాచ్ ప్రూఫ్ కార్లు!
హాటీస్ బర్గ్: ప్రపంచ నగరాలన్నీ ట్రాఫిక్ భూతంతో విలవిల్లాడిపోతున్నాయి. ఈ ట్రాఫిక్ భూతం ప్రజల విలువైన సమయాన్ని మింగడమే కాదు, ప్రియమైన వాహనాల అందం దెబ్బతినే విధంగా స్కాచెస్ (గీతలు) పడేందుకు కూడా కారణభూతమవుతోంది. ఇష్టపడి కొనుకున్న వాహనం ట్రాఫిక్ రద్దీలో గీతలు పడి అసహ్యంగా తయారు కావడం వాహన ప్రియులను మనోవేదనకు గురి చేస్తున్నాయి. లక్షలు పోసి స్టేటస్ సింబల్ గాను, మనసుపడి కొనుక్కున్న వాహనాలపై గీతలు పడడం ఎవరికైనా బాధనిపిస్తుంది. వాహన ప్రియులకు శుభవార్త, వాహనంపై గీత పడిన 30 నిమిషాల్లో తనకుతానుగా మరమ్మతు చేసుకోగల రసాయనిక పదార్థాన్ని పై పూతగా వాడే విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
వాహనంపై వేసిన పెయింట్ పై పడిన గీతల్ని మరమ్మతు చేసుకోగల రసాయన పదార్ధం ప్లాస్టిక్ కానక్కర్లేదు. ప్లాస్టికేతర రసాయన పదార్ధాన్ని వాహనాల పెయింట్ పై ఒక పూతగా వేస్తారు. ఈ పూత వలన వాహనం పెయింట్ పై పడిన గీత వాహనాన్ని అరగంట సేపు ఎండలో ఉంచితే మాయమై పోతుందని ఆ శాస్త్రవేత్తలు తెలియజేశారు. కారు తిరిగి ఎప్పటిలా కొత్త కారులా మారిపోతుంది. వాహనాల నిర్వహణలో ఇదొక విప్లవాత్మక మార్పుగా నిలుస్తుంది. తనకు తానుగా గీతలను మాయం జేయగల కోటింగ్ ను శాస్త్రవేత్తలు రూపొందించిచడం అద్భుతం. ప్రపంచం వ్యాప్తంగా వాహన ప్రియులకు ఈ కోటింగ్ ఒక వరం లాంటిది.
వాహనాలపై గీతల పడకుండా ఉండేందుకు వేసే కోటింగ్ ను కాంపాక్ట్ డిస్కులు, సన్ గ్లాసులు, ఐ-పాడ్ స్కీన్లు, హ్యాండ్ బ్యాగ్స్, షూలు, సెల్ ఫోన్ స్కీన్లు, చివరికి ఫర్నీచర్ లాంటి గీతలు పడే వస్తువులన్నిటికి వినియోగించవచ్చు. ఇంకా ప్రయోగాత్మక స్థాయిలోనే ఉన్నప్పటికీ ఈ భావన విప్లవాత్మకమైనదిగా గుర్తించాలి. అయిదేళ్లలో ఆ రసాయనిక పైపూత మార్కెట్ లోకి రావచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ తెలివైన పాలిమర్ ను అభివృద్ధి చేసిన హాటీస్ బర్గ్ దక్షిణ మిసిసిపీ విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ డాక్టర్ మారెక్ అర్బన్ తెలిపారు. వైద్య పరికారలపై పడిన గీతల్లో సూక్ష్మజీవులు చేరకుండా ఉండేందుకు ఈ స్కాచ్ ప్రూఫ్ రసాయనాన్ని పూతగా వాడొచ్చని అర్బన్ తెలిపారు.
Pages: 1 -2- News Posted: 13 March, 2009
|