ఇరవయ్యేడుకే వృద్ధాప్యం!
లండన్\ముంబై: మనుషుల్లో వృద్ధాప్యం 27 ఏళ్లకు ప్రారంభమవుతుందని తాజా అధ్యయనం తెలియజేసింది. తాళాలు మరచిపోవడం, పదాలు మరచి పోవడం, ఆలోచన స్రవంతిలో గండిపడటం లాంటి తరచు ప్రబలంగా వయోవృద్దుల్లో మనం చూస్తున్న ప్రముఖ వృద్ధాప్య ఛాయలు దశాబ్దాల క్రితమే ప్రారంభమవుతాయని ఆ అధ్యయన పరిశీలకులు తెలిపారు. వాస్తవంలో, ప్రజల మానసిక కార్యకలాపాలు 22లో అత్యున్నత స్థాయికి చేరుకుంటాయని 27 ఏళ్లకు క్షీణించడం ప్రారంభిస్తాయని ఆ అధ్యయనం తెలిపింది. వయసు సంబంధిత అభివ్యక్తి సమస్యలు 20-30 ఏళ్ల వయసు నుండి ప్రారంభమవుతాయని ఆధ్యయన పరిశీలకుడు ప్రొఫెసర్ తిమోతి సాల్టహౌస్ డెయిలీ మెయిల్ తెలిపింది.
ఈ అధ్యయనం కోసం 18-60 ఏళ్ల వయసున్న 2 వేల మంది స్తీ-పురుషులను ఎంపిక చేశారు. ఈ అధ్యయనం కోసం మంచి ఆరోగ్యవంతుల్ని, విద్యావంతుల్ని ఎంపిక చేశారు. విజువల్ పజిల్స్, పదాలను గుర్తు చేసుకోవడం, కథా వివరాలు, లెటర్లు, సింబల్స్ ద్వారా కొన్ని సమస్యా పూరణలను వారికి అందిస్తారు. బుద్ది మాంద్యం లాంటి పలు రుగ్మతల నిర్ధారణ కోసం ఇలాంటి పరీక్షల్ని నిర్వహిస్తారు. ఈ అధ్యయనాన్ని నిర్వహించిన వర్జీనియా విశ్వవిద్యాలయం పరిశోధనను న్యూరోబయోలజీ ఆఫ్ ఏజింగ్ ప్రచురించింది. ఇందుకోసం నిర్వహించిన 12 పరీక్షల్లో 9 పరీక్షలకు 22 ఏళ్ల వయసు వారు హాజరైనట్లు ఆ జర్నల్ ప్రచురించింది.
Pages: 1 -2- News Posted: 17 March, 2009
|