'ఒబామా జుట్టు నల్లబరుస్తా'
బెంగళూరు: యువ సెనేటర్ నుంచి 'సిల్వర్ ఫాక్స్'గా అకస్మాత్తుగా బరాక్ ఒబామా పరివర్తనం చెందడంతో 47 సంవత్సరాల అమెరికా అధ్యక్షుడు అమెరికా యువతరాన్ని ఆకట్టుకోవడానికి తన తెల్ల జుట్టుకు నల్ల రంగు వేసుకున్నారనే వదంతులు వ్యాపించాయి. అయితే, అలా రంగు వేసుకోవడం వల్ల యువకుడైన ఆ అధ్యక్షునికి ఏమాత్రం ఉపయోగం లేదని, ఆయన నుదుటి చుట్టూ, తలపైన నెరపు కొట్టవచ్చినట్లుగా కనిపిస్తున్నదని కొచ్చికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఒకరు చెబుతున్నారు.
74 సంవత్సరాల కొచ్చి వైద్యుడు ఎన్.కె.పి. వైద్యన్ అమెరికా అధ్యక్షుడు ఒబామాకు ఒక పరిహారాన్ని సూచించారు. దీని వల్ల కొన్ని నెలలలోనే ఆయన జుట్టు తిరిగి నల్లబడుతుందని వైద్యన్ అంటున్నారు. ఆయుర్వేదంలో గొప్ప పురస్కారంగా పరిగణిస్తున్న వైద్య వాచస్పతి అవార్డు గ్రహీత అయిన వైద్యన్ తన చిట్కాను ఉపయోగించవలసిందని విజ్ఞప్తి చేస్తూ అమెరికా అధ్యక్షునికి ఒక లేఖ రాశారు. ఒక కాప్స్యూల్, ఒక ద్రావకం వాడితే తక్షణం ఫలితం ఉంటుందని వైద్యన్ సూచించారు.
వైద్యన్ అభిప్రాయం ప్రకారం, దీని వల్ల మెలానిన్ (జుట్టుకు నల్ల రంగు రావడానికి కారణమైన పదార్థం)ను పెరగడమే కాకుండా జుట్టు పెరుగుతుంది. ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఆయన తన పరిశోధనపై మరింతగా కృషి చేసి ఒబామా కోసం ప్రత్యేకంగా దానిని మరింత బలవర్ధకం చేశారు. 'నేను దానిపై నా జీవితాన్నే పందెం కడతాను' అని వైద్యన్ 'డిఎన్ఎ' విలేఖరితో ఫోన్ లో మాట్లాడుతూ చెప్పారు. 'నేను 55 సంవత్సరాలుగా ఆయుర్వేద ఔషధాలు తయారు చేస్తున్నాను. ఒబామాను నేను అభిమానిస్తున్నందున, ఆయన క్షేమం ప్రపంచ సుస్థిరతకు ప్రధానమైనందున ఆయనకు ఈ చిట్కాను సూచించాను' అని తెలియజేశారు.
Pages: 1 -2- News Posted: 17 March, 2009
|