'నో స్మోకింగ్'కు ఆమె బలి!
ముంబై: సిగరెట్ తాగవద్దని బాయ్ ప్రెండ్ అడ్డు పడటాన్ని ఆమె సహించలేకపోయింది. అందుకు ఆమె తనకిక జీవితమే వద్దనుకుని ప్రాణం తీసుకున్నట్లు తెలుస్తున్నది. జెట్ ఎయిర్ వేస్ లో ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తున్న 20 సంవత్సరాల అనుపమ ఆచార్య అదే సంస్థలో కో-పైలట్ అయిన బాయ్ ఫ్రెండ్ 24 సంవత్సరాల సమర్ యజుర్వేదితో ధూమపానంపై తీవ్ర వాగ్వాదం అనంతరం ఒక భవనంలోని ఐదవ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
ముంబైలోని పోవైలో జరిగిన ఈ సంఘటనపై మృతురాలి బాయ్ ఫ్రెండ్ సమర్ పోలీసులకు తెలియజేసిన వివరాల ప్రకారం, అనుపమ మంగళవారం తనకు ఫోన్ చేసి తాను ఫ్లైట్ మిస్సయ్యానని, బాగా దిగులు చెందానని, కనుక ఒకసారి కలుసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పింది. ఆ రోజు ఆఫ్ అయిన సమర్ పోవైలోని ఝీల్ దర్శన్ భ వనంలో ఐదుగురు స్నేహితులతో కలసి తాను ఉంటున్న ఆరవ అంతస్తు ఫ్లాట్ కు రావలసిందని ఆమెను కోరాడు. సాయంత్రం దాదాపు 4 గంటలకు సమర్ నివాసానికి అనుపమ వచ్చింది. వారిద్దరు గోరెగావ్ లోని హబ్ మాల్ లో '13బి' చిత్రం చూసేందుకు వెళ్లారు. చిత్రం చూసిన తరువాత ఆల్కహాల్ సేవించాలని అనుపమ కోరుకున్నదని సమర్ పోలీసులకు తెలిపాడు.
'అనుపమ, సమర్ అతని రూమ్ మేట్లతో కలసి అతని నివాసంలో రమ్ తాగారు. ఆ పార్టీ అర్ధరాత్రి దాటిన తరువాత 1.30 వరకు సాగింది. అనుపమ సిగరెట్ తాగాలనుకుంది. కాని వద్దని సమర్ చెప్పినప్పుడు ఆమె ఆగ్రహం చెందింది' అని పోవై పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్ స్పెక్టర్ రాజదూత్ రూపవతే తెలియజేశారు. ధూమపానానికి తనను సమర్ అనుమతించకపోవడంతో అనుపమ తీవ్ర ఆగ్రహానికి గురై, దూకుడుగా ప్రవర్తించసాగిందని, తాను ఇతర మహిళలతో కలసి నివసిస్తున్న అంధేరి ఫ్లాట్ కు వెళ్ళిపోవాలనుకుంటున్నానని ఆమె చెప్పిందని రూపవతే తెలిపారు.
Pages: 1 -2- News Posted: 19 March, 2009
|