నీళ్లు కావు, సెక్స్ హార్మోన్లు
లండన్: ఒక ప్లాస్టిక్ బాటిల్ లో నిల్వ ఉంచిన మినరల్ వాటర్ తాగితే, సెక్స హార్మోన్ ను కూడా తాగినట్లవతుందని ఒక తాజా అధ్యయనం తెలిపింది. మినరల్ వాటర్ బాటిల్ నుండి ఈస్ట్రోజన్ అనే స్త్రీల సెక్స్ హార్మోన్ విడుదలై అందులో నిల్వ ఉంచిన నీటిలో కలుస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు స్త్రీల సెక్స్ హార్మోన్ ఈస్ట్రోజన్ ను ఇలా తెలివితక్కువగా తాగితే సదరు వ్యక్తుల పునరుత్పత్తి వ్యవస్థ సాంతం దెబ్బితింటున్నట్లు ఆ అధ్యయనం తెలిపింది. ప్లాస్టిక్ ప్యాకేజీల నుండి విడుదలయ్యే పదార్ధాలు స్త్రీ సెక్స్ హార్మోన్ ఈస్ట్రోజన్ లా శరీరంపై పనిచేస్తున్నట్లు జర్మన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ప్లాస్టిక్ నుండి విడుదలయ్యే పద్దార్ధాలు మనుషుల్లోని పునరుత్పత్తి సామర్ధ్యాన్ని నిర్వీర్యం చేయడంతోపాటు, తల్లి పాలు స్రవించడాన్ని నిరోధిస్తాయి. అయితే శిశువలపై ఈస్ట్రోజెన్ ప్రభావాన్ని ఇంకా అంచనా వేయలేదు. ఆహార పదార్ధాలను నిల్వ చేస్తున్న ప్లాస్టిక్ ప్యాకేజీల నుండి సదరు పదార్ధాల్లోకి విడుదలయ్యే రసాయనాలు మానవులపై కల్గించే దుష్ప్రభావాలను ఆ అధ్యయనం పరిశీలించింది. ఫ్రాంక్ ఫర్ట్ లోని గోథే విశ్వవిద్యాలయానికి చెందిన ఆక్వాటిక్ ఎకోటాక్సాలజీ డిపార్ట్ మెంట్ పరిశోధకులు మార్టిన్ వాగ్నర్, జెఆర్జి ఓహ్లమన్ లు ఈ అధ్యయనాన్ని చేపట్టారు.
Pages: 1 -2- News Posted: 27 March, 2009
|