లక్కీ స్టూడియోల వైపు పరుగు
హైదరాబాద్ : హైదరాబాద్ నారాయణగూడలోని ఒక ఫోటో స్టూడియోకు, కరీంనగర్ సిరిసిల్లలోని ఒక పాటల రికార్డింగ్ స్టూడియోకు ఒక విషయంలో సామ్యం ఉంది. పార్టీలతో నిమిత్తం లేకుండా రాజకీయ నాయకులు ఆ రెండింటినీ అదృష్టం కొనితెచ్చేవిగా పరిగణిస్తుంటారు.
నారాయణగూడలోని ఫోటో స్టూడియోకు పెళ్ళీడు యువతుల వరదాయినిగా పేరు ఉన్నది. కాని ఎన్నికల సమయంలో మాత్రం తమను అదృష్టం వరిస్తుందనే విశ్వాసంతో రాజకీయ నాయకులు తమ ఫోటోల కోసం ఆ స్టూడియో వద్ద బారులు తీరుతుంటారు.
ఆ 'స్టూడియోపై నమ్మకం ఉన్న' ప్రముఖ నాయకులు కొందరిలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర అధ్యక్షుడు, సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి పార్టీ అభ్యర్థి బండారు దత్తాత్రేయ, సిట్టింగ్ ఎంపి, అదే సెగ్మెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్, రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి కూడా ఉన్నారు. 'ఈ స్టూడియోలో ఎన్నికల ప్రచారం కోసం ఫోటో తీయించుకోవడం నాకు అదృష్టం కలిగిస్తుందని నా దృఢ నమ్మకం. ఇది నాకు ఒక ఆచారం అయింది' అని దామోదర్ రెడ్డి చెప్పారు.
ఇదే విధంగా పలువురు రాజకీయ నాయకులు సిరిసిల్లలోని రికార్డింగ్ స్టూడియోలో తమ ఎన్నికల ప్రచారం సిడిలను సిద్ధం చేయించుకుంటుంటారు. ఈ స్టూడియోలో తెలంగాణ ప్రాంతం గీత రచయితలు 'గ్రామీణ అనుబంధం'తో ప్రచార గీతాలు రాస్తుంటారు. ఆ పాటలను ఆ తరువాత జానపద గాయకులు ఆలపిస్తారు.
ఈ స్టూడియో రెగ్యులర్ కస్టమర్లలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు, ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) సీనియర్ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ కూడా ఉన్నారు.
Pages: 1 -2- News Posted: 4 April, 2009
|