కొడుకు పుట్టాలని....?
న్యూఢిల్లీ : వంశానికి వారసుడు కావాలని, ఎలాగైనా కొడుకును కనాలని దేవుళ్ళను మొక్కుకున్నాడు. స్నానం చేయకుండా, పళ్ళు తోముకోకుండా భార్యతో సంసారం చే్స్తే కొడుకు పుడతాడని ఓ సన్యాసి చిట్కా చెప్పాడు. అంతే ఆ మహానుభావుని ఉపదేశంతో ఈ భారతీయుడు స్నానాన్ని, పళ్ళు తోముకోడాన్ని త్యజించేశాడు. అదిగో, ఇదిగో అంటూ కాలం గడిచిపోయింది. ఒకటా రెండా ఏకంగా ముప్ఫై ఐదేళ్ళు గడిచిపోయాయి. కొడుకు మాత్రం పుట్టలేదు. కానీ, ఏడుగురు కూతుళ్ళకు తండ్రయ్యాడు.
పుణ్యక్షేత్రమైన వారణాసి నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ గ్రామంలో నివసిస్తున్న కైలాష్ కు ఇప్పడు 63 సంవత్సరాలు.అందరూ ఈయనను `కాలూ' అని పిలుస్తూ ఉంటారు. తనకు ఈ అలవాటు ఎలా మొదలైందో, ఎందుకు మొదలైందో గుర్తులేదని చెబుతున్నాడు. కాని గత ముప్పైఐదేళ్ళుగా తాను నీటితో స్నానం చేయలేదని, మొఖం కడుక్కోలేదని కించింత్ గర్వంగానే శెలవిస్తున్నాడు. నా ఒళ్ళు శుభ్రంగానే ఉందని వితండవాదం కూడా వినిపిస్తున్నాడు. ఎందుకంటే ఈ కాలూ బాబు ప్రతీరోజూ సాయంత్రం భగభగలాడే మంట ముందు ఒంటి కాలిపై నిలబడి జపం చేస్తుంటాడు.ఆపై తనివి తీరా గంజాయి దమ్ము బిగించికోడతాడు.తాను శివుడిని ఆరాధిస్తున్నాని, అగ్నిపునీతుడనని, తాను అగ్నితో రోజూ స్నానం చేస్తున్నానని, ఇది నీళ్ళతో స్నానం చేసినట్టేనని వాదిస్తున్నాడు. అగ్ని వేడికి తన శరీరంపై ఉంటే సకల మాలిన్యాలు తొలగిపోతున్నాయని వివరిస్తూ ఉంటాడు.
Pages: 1 -2- News Posted: 13 May, 2009
|