అమ్మమ్మలు కావాలి!
గువాహతి : పల్లెల్లో కాన్పులన్నీ గతంలో మంత్రసానుల చేతుల్లోనే జరిగేవి. నవజాత శిశువు(అప్పుడే పుట్టిన పిల్లలు)లకు తలెత్తే ఇబ్బందులకు ఇళ్ళల్లోని బామ్మలు, మంత్రసానులు చిట్కాలు చెప్పేవారు. కాలం మారడంతో మంత్రసానులు అంతర్ధానమయ్యారు. దీని ఫలితంగానే కొన్నిచోట్ల శిశు మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది.
2007లో జాతీయ స్థాయిలో శిశు మరణాల రేటు 55 ఉంటే, అసోంలో 66 ఉంది. శిశు మరణాల సంఖ్యను తగ్గించేందుకు అసోం ప్రభుత్వం 'సఖి' ప్రాజెక్టును ఏడాది కాలంగా అమలు చేస్తోంది. గ్రామాల్లోని వృద్ధ మహిళలను కాంట్రాక్ట్ పద్ధతిలో ఆస్పత్రుల్లో నియమించారు. వీరు నిండు చూలాళ్ళకు, బాలింతలకు నవజాత శిశువుల సంరక్షణకు తీసుకోవాల్సిన సంప్రదాయ చిట్కాలు బోధిస్తారు. వాటితో పాటు అధునాత చిట్కాలను కూడా బాలింతలకు చెబుతున్నట్లు అసోం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హేమంత విశ్వ శర్మ తెలిపారు. రెండు ఆస్పత్రుల్లో ఏడాదిగా అమలు చేస్తున్న ఈ పథకం పనితీరును సమీక్షిస్తామని ఆయన చెప్పారు. రానున్న మూడు నెలల్లో హోం సైన్స్ లో శిక్షణ పొందిన యువతులను కూడా 'సఖులు'గా నియమిస్తామన్నారు.
Pages: 1 -2- News Posted: 8 July, 2009
|