ఎడబాటుతో అనారోగ్యం! న్యూఢిల్లీ : మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము! అదే స్వర్గము!!
అని 'డాక్టర్ చక్రవర్తి' చిత్రంలో మనసుకవి ఆత్రేయ ఏనాడో చెప్పారు.
ఇది నిజమేనని షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన సామాజికశాస్త్రం ప్రొఫెసర్ లిండా వైట్ చెబుతున్నారు. ఈ మేరకు వైట్ ఆధ్వర్యంలో జరిగిన అధ్యయన ఫలితాలు సెప్టెంబర్ సంచిక - 'ద జర్నల్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ బిహేవియర్'లో ప్రచురితం కానున్నాయి.
ఈ అధ్యయనం ప్రకారం ఒంటరిగా మారిన వివాహితులు, లేదా విడాకులు తీసుకున్నవారు లేదా భార్యను కోల్పోయిన వ్యక్తులు మానసికంగా తామేదో కోల్పోయినట్టు బాధపడుతున్నారు. మధ్యవయస్కుల్లో భార్యావియోగులు, విడాకులు తీసుకున్న వారికన్నా బ్రహ్మచారులు దీర్ఘకాలంగా జబ్బులతో బాధపడుతున్నారని అధ్యనం ద్వారా తెలుస్తోంది.
ప్రొఫెసర్ వైట్ ఆధ్వర్యంలో 8,652 మంది స్త్రీ, పురుషులపై అధ్యయనం జరిగింది. వీరంతా 50 నుంచి 60 ఏళ్ళలోని వారే! వివాహ బంధాన్ని కోల్పోయిన తరువాత మానసికంగా కుదుటపడినా కూడా వారిని శారీరక అనారోగ్యం వెంటాడుతోందట!
అంతమాత్రాన తిరిగి వివాహం చేసుకోండని చెప్పినట్లు కాదు. ఆరోగ్యానికి వివాహం కూడా ఒక ముఖ్యమైన అంశంగా భావించి మళ్ళీ వివాహం చేసుకున్న వ్యక్తులు, మానసిక వత్తిడిని సమతౌల్యం సాధించడంలో శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. 'జీవిత భాగస్వామి జబ్బు పడినా, మరణించినా... మీ వైవాహిక బంధం చెడుగా పరిణమించినా మీపై మానసిక వత్తిడి పెరుగుతుందని ' లిండా వైట్ తెలిపారు.
Pages: 1 -2- News Posted: 10 August, 2009
|