14 మంది భార్యల మొగుడు ముంబై : రెండు జీవితాలు సాగించడమే ఎవరికైనా కష్టం. అటువంటిది ముంబైలో ఒక వ్యక్తి గడచిన రెండు సంవత్సరాలుగా 14 విభిన్న జీవితాలు అదీ 14 మంది భార్యలతో సాగిస్తున్నాడు. గడచిన రెండున్నర సంవత్సరాలలో 14 మంది మహిళలను వివాహం చేసుకున్నందుకు 40 సంవత్సరాల వ్యక్తిని పోలీసులు ఆగస్టు 18న అరెస్టు చేశారు. అతను ఎయిర్ ఇండియాలో ఇంజనీర్ గా పని చేస్తుండేవాడు. అయితే, తుషార్ వాఘ్మరే అలియాస్ తుషార్ బాపట్ అంత మందిని వివాహం చేసుకున్నందుకు ఉద్యోగం నుంచి ఉద్వాసనకు గురైనట్లు పోలీసు అధికారులు తెలియజేశారు.
వాఘ్మరేపైన ఇంతవరకు అధికారికంగా ఐదు ఫిర్యాదులు నమోదయ్యాయి. తమకు అపఖ్యాతి రావచ్చుననే భయంతో మిగిలిన తొమ్మిది మంది బాధితులు ఫిర్యాదులు దాఖలు చేయడానికి ముందుకు రావడం లేదని పోలీసు అధికారులు చెప్పారు. వాఘ్మరే ఒక పెళ్ళి సంబంధాల పోర్టల్ లో తన వివరాలు నమోదు చేసుకున్నట్లు, 2006లో తన భార్యకు విడాకులు ఇచ్చానని వెల్లడించినట్లు దర్యాప్తు సిబ్బంది తెలిపారు. విడాకులు తీసుకున్న లేదా వితంతువులైన బ్రాహ్మణ ఉద్యోగినులను వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు అతను తన ఆ పోర్టల్ కు తెలియజేశాడు.
అతను నగర్ కు చెందిన ఒక భార్యతో సహా మొత్తం 14 మంది భార్యల 'పోషణ చూసుకొనేవాడు' అని, అయితే, చివరకు అతను తన నెల జీతం రూ. 70 వేలను పూర్తిగా ఖర్చు చేసిన తరువాత వారే అతనిని పోషించేవారని అధికారులు తెలిపారు. వాఘ్మరే వివాహం చేసుకున్న వారిలో ముగ్గురు మహిళలు ఆర్కిటెక్ట్ లు లేదా ఇంజనీర్లు అని, మిగిలినవారు గృహిణులని పోలీసు అధికారులు చెప్పారు.
Pages: 1 -2- News Posted: 27 August, 2009
|