సిరంజ్ ఇక అనవసరం! ఇంజెక్షన్ చేయించుకోవడం ఎంత బాధాకరమో ఏ రెండేళ్ళవాడిని అడిగినా చెబుతాడు. అది చేయించుకున్నప్పుడు కలిగే నొప్పి సంగతి అలా ఉంచితే, ఇంకా పలు కారణాలుగా ఇంజెక్షన్లు సమస్యాత్మకమైనవే. సరిగ్గా స్టెరిలైజ్ చేయకుండా సిరంజ్ లను తిరిగి వాడినట్లయితే వాటి వల్ల వ్యాధి వ్యాపిస్తుందు. ఇక ద్రవపూరిత వ్యాక్సిన్ల సంగతి సరేసరి. వాటికి నిరంతరం రిఫ్రిజిరేషన్ తప్పని సరి. వాటిని ఫ్యాక్టరీ నుంచి క్లినిక్ కు తరలిస్తున్నప్పుడు వాటి శీతలీకరణ గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఇక చర్మంలోకి గుచ్చే(హైపోడెర్మిక్) సూదులు శరీరంలో కావలసిన ప్రదేశానికి వాక్సిన్లను చేర్చవు.
రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా వాక్సిన్లు పని చేస్తాయి. అలా జరగాలంటే ముందు ఏంటిజెన్ కారకాలుగా పేర్కొనే కణాలతో సమ్మిళితం కావలసి ఉంటుంది. ఈ కణాలు రోగాన్ని కలిగించే పరాయి క్రిములను గుర్తించి వాటిని ఛేదించి, వాటి లక్షణాలను రోగనిరోధక వ్యవస్థకు చేరుస్తాయి. దాని వల్ల రోగాన్నికలిగించేవాటిని గుర్తించి సముచిత చర్యలు తీసుకొనవచ్చు. రోగం వ్యాప్తికి వచ్చిన క్రిమి కొత్తది అయిన పక్షంలో ఈ ప్రక్రియ రోగనిరోధక వ్యవస్థను దానిని గుర్తించేందుకు, వచ్చేసారి మరింత శీఘ్రంగా స్పందించేందుకు వీలు కల్పిస్తుంది.
శరీరం ఇన్ఫెక్షన్ కు గురి కాకుండానే వ్యాధి గురించి రోగ నిరోధక వ్యవస్థ తెలుసుకోవడానికి వాక్సిన్ వీలు కల్పిస్తుంది. అయితే, హైపోడెర్మిక్ సూది మొన చొచ్చుకువచ్చే కండరాలలో కాకుండా పాథేజెన్ లు చేరుకునే ఊపిరితిత్తులు, చర్మం వంటి ప్రదేశాలలో యాంటిజెన్ కారక కణాలు సమీకృతం అవుతుంటాయి.
ఈ పరిస్థితిని ఎలా మెరుగుపరచాలనేది వాషింగ్టన్ డిసిలోని అమెరికన్ కెమికల్ సొసైటీలో ఈ సంవత్సరం జరిగిన సమావేశంలో చర్చలలో ప్రధానాంశం అయింది. రెండు ప్రతిపాదనలూ బాధాకరమైన సూదులల ఆవశ్యకతను, ద్రవాలను శరీరం అంతటికీ చేరవేయవలసిన ఆవశ్యకతను తొలగిస్తాయి. ఏంటిజెన్ కారక కణాలు పుష్కలంగా ఉన్న ప్రదేశాలకు మందులు చేరడానికి అవి దోహదం చేస్తాయి.
Pages: 1 -2- News Posted: 2 September, 2009
|