గర్భం సెక్స్ కు ఆటంకమా? దంపతుల మధ్య సత్సంబంధాలు పటిష్ఠం కావడానికి ఏకైక మార్గం లైంగిక జీవితమే. స్త్రీ గర్భం దాల్చినప్పుడూ, ప్రసవం తరువాతా సెక్స్‌లో పాల్గొనేందుకు రకరకాల ఆంక్షలు పెడుతుంటారు మన పెద్దలు. స్త్రీ గర్భం ధరించిన తర్వాత, ప్రసవం అనంతరం శిశువు ఆ తల్లి జీవితంలో చాలా మార్పులు తీసుకువస్తుంది. నిజానికి గర్భవతితో సెక్స్ తగనిదేమీ కాదు. మామూలు పరిస్థితుల్లో గర్భిణులతో ఎనిమిదో మాసం వరకూ సెక్స్ కార్యక్రమాలు కొనసాగించవచ్చు. కానీ, వారికి ఇన్ఫెక్షన్లు వుండటమూ, గర్భవిచ్ఛిత్తి జరిగే అవకాశాలూ వుంటే మాత్రం వద్దనే సలహా ఇస్తారు డాక్టర్లు.
గర్భం దాల్చిన కొత్తల్లో లైంగికకార్యక్రమాలకు ఆటంకాలేవీ వుండవు. క్రమంగా కలిగే హార్మోన్‌ల మార్పుల వల్ల, గర్భవతికి, సెక్స్ పట్ల ఆసక్తి క్రమంగా తగ్గుతుంది. హార్మోన్ల మార్పుల వల్ల రతిక్రియ జరుగుతున్నప్పుడు లూబ్రికేషన్ తగ్గటం చేత సెక్స్, ఆనందదాయకంగా కాక, బాధాకరంగా తోస్తుంది. ఇది పూర్తిగా దంపతుల ఇష్టం మీదే ఆధారపడి వుంటుంది. కానీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే గర్భవిచ్ఛిత్తి జరగటం, ఇన్ఫెక్షన్‌లు వుండటం, రతిక్రియ వల్ల రక్తస్రావం కావటం జరిగితే మాత్రం, దంపతులు దూరంగా వుండటమే మేలు.
గర్భం వచ్చిన తొలి రోజుల్లో గర్భస్రావాలు జరిగితే, ఆ రోజుల్లో లైంగికకార్యక్రమాలు వద్దనుకోవటమే మేలు. ఇది మునుపటి కాలంలో మన పెద్దల అనుభవంలోకి వచ్చిన వ్యవహారం. ఒకసారి అబార్షన్ జరిగినవారిని జాగ్రత్తగా వుండమనేందుకే ఇలా చెబుతారు. కానీ లైంగికక్రియ వల్ల గర్భవిచ్ఛిత్తి, సామాన్యంగా జరగదనేది డాక్టర్లందరూ అంగీకరించిన సంగతి. గర్భవతి లైంగికక్రియ వల్ల అలా జరుగుతుందేమో అనే అనుమానంతో వుండటం నుంచి బయటపడుతుందనే ఉద్దేశంతో, దూరంగా వుండమంటారు. కొందరి విషయంలో చివరి నెలల్లో సెక్స్‌కు దూరంగా వుండమనటం, ఉమ్మినీరు బయటికి వచ్చేస్తుందనే అభిప్రాయంతో. మరి కొందరి విషయంలో ప్రసవం తాలూకు నొప్పులు త్వరగా వస్తాయని, డాక్టర్‌లే సెక్స్ జరపమనీ అంటారు.
Pages: 1 -2- News Posted: 9 October, 2009
|