కండోమ్స్ తో జాగ్రత్త! వయాగ్రా లేదా సెక్స్ ఉత్ప్రేరణ కోసం వినియోగించే ఏ డ్రగ్ వల్లనైనా రతి సమయంలో కండోమ్ చిరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రీయ పరిశోధనలలో వెల్లడైంది. సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్‌ఫెక్షన్స్ అనే మాగజైన్ ఈ పరిశోధనకు సంబంధించిన ఒక ఆర్టికల్ ను ప్రచురించింది. ఈ అంశంపై అధ్యయనం జరిపిన పరిశోధనకులు తమ అధ్యయనం కోసం 440 మంది పురుషులను ఎంచుకున్నారు. ఈ ఎంపిక ఇంటర్నెట్‌లో ప్రకటనల ద్వారా జరిగింది. ఎంపిక చేసిన పురుషులందరిని ప్రత్యేకంగా కండోమ్ వాడకానికి నియమించారు. వాళ్లకి యిచ్చిన ప్రశ్నాపత్రం ద్వారా ఇటీవల వాళ్లు జరిపిన లైంగిక సంపర్కాల వివరాలు సేకరించారు.
పరిశోధకులు ఎంపిక చేసుకున్న పురుషులలోని ప్రతి 10 మందిలో ఒకరు సెక్స్ సామర్ధ్యం కోసం వయాగ్రా వంటి మందులు వాడారు. వాళ్లలో 12 శాతం, తమ సంపర్క సమయంలో కండోమ్ చిరిగిపోయిన విషయం ఒప్పుకున్నారు. అయితే లేపన శక్తి కోసం మందులు వాడని వాళ్లలో, 5 శాతం మందికి మాత్రమే సంభోగ సమయంలో కండోమ్ చిరిగిపోయే ప్రమాదం సంభవించిందట!
ఎక్కువ సేపు రతి జరపగల శక్తి వున్న మగవాళ్లకి కూడా, తరచుగా కండోమ్స్ చిరిగిపోయే ప్రమాదాలు జరిగాయట. ఇప్పుడు, దాంపత్యంలో సంతాన నియంత్రణ కోసం, వివాహేతర సంబంధాలలో సుఖవ్యాధులూ, (వెనీరియల్ డిసీజెస్), హెచ్‌ఐవి/ ఎయిడ్స్ లాంటి వ్యాధులు సోకకుండా నివారించడం కోసం ముందు జాగ్రత్తగా కండోమ్స్ వాడే పురుషుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. వాళ్లలో లైంగిక సుఖం పెరగడానికి, లేపన శక్తి సంతరించుకోవడం కోసం, కామోత్తేజక ఔషధాలు వాడే వాళ్లలో, కనీసం 4 శాతం పురుషులు ఇలా రతి సమయంలో కండోమ్ చినిగిపోయే బెడదకి గురౌతున్నారు. దానివల్ల కండోమ్ ఉపయోగించినా ప్రయోజనం లేకుండా పోతున్నదనీ, తమకి తెలియకుండానే గర్భధారణలు జరుగుతున్నాయనీ, లైంగిక సంపర్కం వల్ల వ్యాధులు సోకుతున్నాయనీ వాపోతున్నారు.
Pages: 1 -2- News Posted: 9 October, 2009
|