భార్య వద్దకు తండ్రిని... రాజ్ కోట్ : వారసుల కోసం కొందరు ఎంతకైనా తెగిస్తారు. వంశనాశనం కాకూడదనే స్వార్థంతో అఘాయిత్యాలను ప్రోత్సహిస్తారు. చివరకు ఉచ్ఛనీచాలు, వావివరసలు మరచి పోతారనడానికి ఈ సంఘటనే నిదర్శనం. తను 'ఆ విషయం'లో అమర్ధుడినని తెలుసుకున్న ఒక పుత్ర 'రత్నం' ఎలాగైనా తన పెళ్ళాం కడుపు పండాలనుకున్నాడు.... ఏకంగా భార్యపై అత్యాచారానికి తన తండ్రిని ఉసిగొలిపాడు. నిద్ర మాత్రలు ఇచ్చి మరీ చేసిన అఘాయిత్యపు సంఘటనను రెండు నెలల తరువాత బాధితురాలు వెలుగులోకి తెచ్చింది. అత్తింటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన రాజస్థాన్ లోని రాజ్ కోట్ జిల్లా మోర్బీ తాలుకాలో జరిగింది.
తనపై మామ అత్యాచారం చేశాడని రాజ్ కోట్ కు చెందిన ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తకు లైంగిక సామర్ధ్యం లేదని వైద్యులు నిర్థారించిన తరువాతనే ఈ సంఘటన జరిగిందని తెలిపింది. తనపై అత్యాచారానికి భర్త కూడా సహకరించాడని, వారు సంతానం కోసమే ఈ ఘాతుకానికి ఒడిగట్టారని ఆరోపించింది. మామతో పాటు అత్త, భర్త, మరిది, చిన్నమామలపై ఆమె కేసు నమోదు చేయించింది. అత్యాచారం రెండు నెలల క్రితం జరిగిందని, తను దిగ్భ్రాంతి నుండి తేరుకున్నాక ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపింది.
Pages: 1 -2- News Posted: 27 October, 2009
|