వంటతో శృంగారం వంటపని అనగానే అదేదో 'మగా'నుభావులకు 'అంటరాని' పని అన్న భావన మన సమాజంలో విస్తృతంగా ఉంది. వంటింటిలోకి ఎవరన్నా మగవాళ్లు ఎంటరైతే 'ఇది తమ సామ్రాజ్యం' అన్నట్లుగా మగమహారాజులను అక్కడి నుంచి మహిళలు తరిమేయడం కూడా తెలిసిందే. కానీ రోజువారీ వంటపనితో విసిగిపోనక్కరలేదు. ఎంత వంట పని చేస్తే... అంతగా 'వంటి'పనికి మార్గం సుళువంటున్నారు పరిశోధకులు. స్త్రీ, పురుషులు కలసిమెలిసి పాకశాలలో పనిచేయడం వల్ల శృంగార పాకం సమపాళ్ళలో పండుతుందని పరిశోధకులు అంటున్నారు.
వంట పని ఎంతగా చేస్తే అంతగా సరససల్లాపాల్లో మునిగి తేలవచ్చన్నది అధ్యయన సారాంశం! రోజువారీ పనులతో జీవితం నిస్సారమైనట్లు తోచే స్త్రీ, పరుషులకు ఇది వర్తిస్తుందని కూడా చెబుతున్నారు. ఇంటిపనుల్లో ప్రాధాన్యతను నిర్ణయించేవారిలో పడకసుఖాన్ని 'త్యాగం' చేసే గుణం కనపించలేదని, వారు సెక్స్ కు ప్రాధాన్యత ఇస్తారని కాన్ స్టాన్స్ గేజర్ చెప్పారు. న్యూజెర్సీలోని మాంట్ క్లెయిర్ యూనివర్శిటీకి చెందిన కుటుంబం, బాలల అధ్యయన శాస్త్రం విభాగానికి చెందిన ప్రొఫెసర్ గేజర్ ఈ పరిశోధనలు నిర్వహించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కు తెలిపారు.
Pages: 1 -2- News Posted: 30 October, 2009
|