అతడు.. ఆమె.. విడాకులు! హైదరాబాద్ : తన జీవిత భాగస్వామికి తెలియకుండానే ఏ వ్యక్తి అయినా విడాకులు పొందడం అనేది చలనచిత్రాలలో మాత్రమే చూస్తుంటాం. ఇప్పుడు హైదరాబాద్ లోని కుటుంబ న్యాయస్థానాలలో కూడా ఎక్స్ పార్టీ విడాకుల కేసుల ధోరణి ప్రబలుతున్నట్లు కనిపిస్తున్నది. తన వివాహం రద్దయిన సంగతి ప్రతివాదికి కనీసం తెలియని కేసులే ఇవి. చాలా కేసులలో విడాకులు కోరే జీవిత భాగస్వాములు వేర్వేరు ప్రాంతాలలో జీవిస్తుండడాన్ని అవకాశంగా తీసుకుని అవతలి వ్యక్తికి కోర్టు సమన్లు అందే సమయం లేదా చిరునామా తప్పుగా పేర్కొనడం ద్వారా ఇటువంటి తీర్పులు సాధిస్తున్నారు.
చట్టం ప్రకారం, కోర్టు సమన్లు అందుకున్నతరువాత ప్రతివాది కోర్టులో హాజరు కాకపోతే కేసు యోగ్యతలను బట్టి సదరు వ్యక్తి పరోక్షంలో కేసును కోర్టు తేల్చేస్తుంటుంది. ఎక్స్ పార్టీ డిక్రీ అనేది మామూలు కోర్టు వ్యవహారమే అయినప్పటికీ ప్రతిఘటన లేకుండానే విడాకులు మంజూరు చేయించుకోవడానికి చాలా మంది చట్టాన్ని, తమ జీవిత భాగస్వామిని వంచించడానికి ఈ వెసులుబాటును దుర్వినియోగం చేస్తుండడమే న్యాయవాదులను కలవరపరుస్తున్నది.
దంపతులలో చాలా మంది వేర్వేరు ప్రాంతాలలో నివసిస్తున్న కారణంగా ఈ అక్రమ పద్ధతిని అనుసరించడం ఎక్కువైపోతున్నదని ఫ్యామిలీ కోర్టు న్యాయవాదులు చెబుతున్నారు. 'ఉదాహరణకు భర్త హైదరాబాద్ లో విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లయితే, భార్య మరొక నగరంలో నివసిస్తున్నట్లయితే, కోర్టు ఈ కేసులో ప్రతివాది అయిన ఆ భార్యకు నోటీసు (సమన్లు) పంపుతుంది. ప్రతివాదికి నోటీసు అందినట్లు గుర్తింపు సమాచారం (అక్నాలెడ్జ్ మెంట్) వచ్చిన తరువాత కోర్టు ఆ భాగస్వామి అనుమతి లభించిందనే భావనతో కేసులో ముందుకు సాగుతుంది' అని ఫ్యామిలీ కోర్టు న్యాయవాది భాస్కర్ బెన్నీ తెలిపారు.
Pages: 1 -2- News Posted: 2 November, 2009
|