వెబ్ సైట్లలో లింగ నిర్ధారణ న్యూఢిల్లీ : 'మూడు సులభ పద్ధతులలో మీకు కావలసిన శిశువును 94 శాతం కచ్చితత్వంతో ఎంపిక చేసుకోండి'. ఇదేదో లోపాయికారి వ్యవహారాల క్లినిక్ వద్ద గల ప్రకటన కాదు. కాని యాహూ సెర్చ్ఇంజన్ లో 'జెండర్ సెలక్షన్ క్లినిక్స్' అని టైప్ చేసినప్పుడు కనిపించే ప్రకటన ఇది. మగ శిశువును లేదా ఆడ శిశువును ఎంపిక చేసుకునేందుకు అవకాశం కలిగించే క్లినిక్ ల ప్రకటనలను పొందుపరచడం ద్వారా పాపులర్ ఇంటర్నెట్ పోర్టల్స్ గూగుల్, యాహూ భారతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయి. భారతదేశం చేసిన 'ప్రీ-నేటల్ డయాగ్నోస్టికి టెక్నిక్స్ (పిఎన్ డిటి) చట్టం 2002' ప్రకారం భ్రూణ హత్యలకు దారి తీసే విధంగా శిశు లింగ నిర్థారణకు టెక్నాలజీని (అల్ట్రాసౌండ్ లు, సోనోగ్రామ్ లు) ఉపయోగించడం, వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం నిషిద్ధం.
ఐక్యరాజ్య సమితి జనాభా విషయాల నిధి (యుఎన్ పిఎఫ్) సమాచారం ప్రకారం, జనన సమయంలో సహజంగా ఉండవలసిన దామాషా ప్రతి వెయ్యి మంది బాలురకు 940 మంది నుంచి 950 మంది వరకు బాలికలు ఉండాలి. డయాగ్నోస్టిక్ టెక్నాలజీ సులభంగా అందుబాటులో ఉండడం వల్ల భారతదేశంలో ఈ దామాషా 1991లోని 945 నుంచి 2001లో 927కు పడిపోయింది.
'ఇండియాలో అందుబాటులో ఉండే ఏ వెబ్ పేజీలో కూడా సెక్స్ ఎంపిక సౌకర్యాలకు సంబంధించిన ప్రకటనలను, స్పాన్సర్డ్ లింక్ లను భారతీయ చట్టం నిషేధిస్తున్నది. అడ్వర్టైజ్ చేస్తున్నది సర్వరా లేక క్లినికా అనే అంశంతో నిమిత్తం లేదు. ఇండియాలో వెబ్ పేజీ తెరవగానే అటువంటి ప్రకటన కనిపించేటట్లయితే, దానిని నిషిద్ధమే' అని సుప్రీం కోర్టు న్యాయవాది ఎ. షెనాయ్ స్పష్టం చేశారు.
Pages: 1 -2- News Posted: 21 November, 2009
|