ముద్దుకు మీసం అడ్డు! ముంబై : ముద్దరాలి మురిపెపు ముద్దులు కావాలా? ముచ్చటైన మీసం, విలాసవంతమైన గడ్డం కావాలో ఆలోచించుకోండి. షేవ్ చేసుకోవాలా వద్దా? పురుషులు రోజూ ఉదయం ఎదుర్కొనే ఈ డైలెమాకు ఆసియా వ్యాప్తంగా నిర్వహించిన ఒక పరిశోధనాత్మక అధ్యయనం పరిష్కారం సూచించవచ్చు. ఇండియా, వియత్నాం, మలేషియాలలో మగవారు మీసం ఉంచుకోవడాన్ని ఇష్టపడతారని, కాని ఇండియాలో పట్టణ ప్రాంతాలలోని ఆడవారు మీసంలేని మగవారినే ముద్దు పెట్టుకోవడానికి సుముఖంగా ఉంటారని ఈ అధ్యయనంలో వెల్లడైంది.
ఇండోనీషియా, మలేషియా, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాలలోను, ఇండియాలో ఎనిమిది నగరాలలో వెయ్యి మందికి పైగా పురుషులు, మహిళలపై ఎసి నీల్సన్ నిర్వహించిన సర్వే ఫలితాలను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఈ సర్వే ప్రకారం, మీసం, గడ్డం లేని పురుషులే ఎక్కువగా మహిళలను ఆకర్షిస్తారని వెల్లడైంది.
ఆసియా అంతటా బారుడు గడ్డం ఉన్నవారిని చూసి పురుషులు, మహిళలు చిరాకు పడుతుంటారు. ఇండియాలోను, థాయిలాండ్ లోను పురుషులు మీసాలను, గరుకు గడ్డాలను ఇష్టపడుతుంటారు. కాని ఇండియాలో పూర్తిగా మీసం, గడ్డం గీసుకున్న వారిని లేదా పిల్లిగడ్డం ఉన్నవారిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
ముంబై, చెన్నై, ఢిల్లీ, కోలకతా, లక్నో, బెంగళూరు, పాట్నా నగరాలలో మహిళలు పురుషులు ఎలా ఉంటే తమకు ఇష్టమో చెప్పారు. ముంబైలో 72 శాతం మంది మహిళలు, చెన్నైలో 83 శాతం మంది మహిళలు పూర్తిగా షేవింగ్ చేసుకున్న మనిషిని చుంబించడం ఇష్టమని చెప్పారు. ఢిల్లీ, కోలకతాలో కూడా అధిక సంఖ్యాకులు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, గరుకు గడ్డం ఉన్నా ఫరవాలేదన్నట్లుగా మహిళలు చెప్పారు. గరుకు గడ్డం మగవాని సెక్సప్పీల్ ను పెంచుతుందని ముంబైలో 64 శాతం మంది మహిళలు చెప్పారు.
Pages: 1 -2- News Posted: 25 November, 2009
|