ప్రాణం పోసిన తల్లి ప్రేమ ముంబై : 'నేను మంచి పనే చేశానని విశ్వసిస్తున్నాను' అని ఠాణె వాసి శైలజా జోషి నవ్వుతూ చెప్పారు. ఆమె అలా అనుకోవడానికి కారణం లేకపోలేదు. 74 సంవత్సరాల ఏడు నెలల వయస్సులో ఆమె తన మూత్ర పిండాన్ని ఇచ్చి కన్నకూతురుకు రెండో జన్మ ప్రసాదించారు. ఈ దేశంలో వృద్ధులైన అవయవ దాతలలో జోషి ఒకరై ఉండవచ్చు.
పెద్ద కుమార్తె గత రెండు సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతుండడం చూడలేక శైలజా జోషి క్రితం తన కిడ్నీలలో ఒకదానిని తన 'పిల్ల'కు దానం చేసింది. 'ఒక కిడ్నీతో నేను బతకగలను' అని ఆమె చెప్పారు. ఈ జంట ఆపరేషన్లు నవంబర్ 30న పెద్దర్ రోడ్ లోని జస్లోక్ ఆసుపత్రిలో జరిగాయి. శైలజా జోషి నాలుగు రోజుల తరువాత డిశ్చార్జి అయ్యారు. ఆమె కుమార్తె 53 సంవత్సరాల విజయ బపత్ క్షేమంగా ఉన్నారు.ఆమెను త్వరలో డిశ్చార్జి చేస్తారు.
'జోషి వయస్సుకు ఆమె కిడ్నీలు విశిష్టంగా ఉన్నాయి. ఆమె ఆరోగ్యం కూడా బాగుంది. అందువల్ల మేము ఆదిలో అభ్యంతరాలు వ్యక్తం చేసినా తన కుమార్తెకు ఒక కిడ్నీని దానం చేయడానికి ఆమెను అనుమతించాలని నిర్ణయించుకున్నాం' అని నెఫ్రాలజిస్ట్ రూషి దేశ్ పాండే చెప్పారు. దాదాపు 75 ఏళ్ల వయస్సులో జోషి ఒక అవయవం దానం చేయగలగడం గొప్పేనని పరేల్ లోని కెఇఎం ఆసుపత్రి నెఫ్రాలజీ విభాగం అధిపతి డాక్టర్ వి.కె. హసె అంటూ, 'అవయవాల మార్పిడి కోసం దాతలుగా 70 ఏళ్ల వరకు వయస్సు ఉన్నవారి అవయవాలను మాత్రమే మేము ఉపయోగించవచ్చునని మార్గదర్శక సూత్రాలు స్పష్టం చేస్తున్నాయి. దాత అర్హత పరిధిని దాటే ముందు డాక్టర్లు అన్ని పరీక్షలూ జరిపే ఉంటారని నా నమ్మకం' అని చెప్పారు.
భారతీయుల ఆయుర్దాయం, మొత్తంమీద ఆరోగ్య స్థితి మెరుగుపడుతుండడంతో దురదృష్టవంతులైన తమ కుటుంబ సభ్యుల కోసం దాతలుగా మారుతున్న వృద్ధులు కొందరు ఉంటున్నారు. రెండు సంవత్సరాల క్రితం లీలావతి ఆసుపత్రిలో ఘాట్కోపర్ వాసి లాల్జీ పటేల్ 72 సంవత్సరాల వయస్సులో అప్పటి ఎనిమిది సంవత్సరాల మనవడు నిషిత్ కు దానం చేశారు. సీనియర్ పౌరులు పలువురు కిడ్నీలు దానం చేశారని ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ట్రాన్స్ ప్లాంట్ సర్జన్, భారతీయ అవయవాల మార్పిడి సంస్థ (ఐఎస్ఒటి) కార్యదర్శి డాక్టర్ సందీప్ గులేరియా తెలియజేశారు. 'మనిషి కాలక్రమానుగత వయస్సు కాకుండా దాత కిడ్నీల స్థితే ముఖ్యం' అని ఆయన చెప్పారు. ఇతర దేశాలలో కూడా 70 ఏళ్లు పైబడిన వారు అవయవాలు దానం చేస్తున్నట్లుగా సమాచారం వస్తున్నది కూడా.
Pages: 1 -2- News Posted: 8 December, 2009
|