రైల్వేకూలీలుగా గ్రాడ్యుయేట్లు ముంబై : 21 సంవత్సరాల బికామ్ విద్యార్థి గణేశ్ సనప్ ఉద్యోగాలకు దరఖాస్తులు పంపడంలో బిజీగా ఉన్నాడు. కంప్యూటర్ హార్డ్ వేర్ లో కోర్సు కూడా పూర్తి చేసిన మూడవ సంవత్సరం విద్యార్థి గణేశ్ సనప్ తాజాగా సెంట్రల్ రైల్వేలో లైసెన్సుడ్ పోర్టర్ ఉద్యోగానికి దరఖాస్తు పంపాడు. 'మంచి జీతం వచ్చే ఉద్యోగం వచ్చేంత వరకు నేను కూలీ పని చేయవలసి వచ్చినా పట్టించుకోను' అని సనప్ సోమవారం ముంబై పరేల్ రైల్వే వర్క్ షాప్ గ్రౌండ్స్ లో శరీర సౌష్టవ పరీక్ష అనంతరం చెప్పాడు. అయితే, కె.జె. సోమయ్య కుమారుడైన సనప్ ఈ విషయం ఇంకా తన తల్లిదండ్రుల చెవిన వేయలేదు. 'నేను తప్పుడు పని చేయనంత కాలం నా తల్లిదండ్రులు అభ్యంతరం చెబుతారని అనుకోను' అని సనప్ అన్నాడు.
త్వరలో గ్రాడ్యుయేట్ కానున్న, పోర్టర్ ఉద్యోగం కోసం పోటీ పడుతూ పరేల్ కు వచ్చింది సనప్ ఒక్కడే కాడు. వాస్తవానికి ఇంకా అనేక మంది వచ్చారు. వారిలో రెండేళ్ల క్రితం పట్టభద్రులై కూడా సోమవారం పోర్టర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసిన సాగర్ దేశ్ ముఖ్, మాధవ్ అవధ్ వంటివారు ఉన్నారు. నరేంద్ర కుడాల్కర్ (26) చాలాకాలంగా నిరుద్యోగిగా ఉన్నాడు. తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కుడాల్కర్ వచ్చాడు. గతంలో అతను ఒక భవన నిర్మాణం సూపర్ వైజర్ గా పనిచేశాడు. కాని కారణమేదీ చెప్పకుండా అతనిని ఆ ఉద్యోగం నుంచి తీసేశారు. 'ఆతరువాత నాకు మరెక్కడా శాశ్వత ఉద్యోగం లభించలేదు. ఇక్కడ ఉద్యోగం లభిస్తుందని ఆశిస్తున్నాను' అని కుడాల్కర్ చెప్పాడు.
రోజూ ఆదాయం ఉంటుందని నమ్మకం లేని 79 ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న 1311 మంది అభ్యర్థులలో సనప్, కుడాల్కర్ కూడా ఉన్నారు. వారిలో అదనపు ప్రొఫెషనల్ అర్హతలు పొందిన గ్రాడ్యుయేట్లు కూడా ఉన్నారు. తుది ఎంపికకు ముందు దరఖాస్తుదారులు కఠినమైన ప్రక్రియను అధిగమించవలసి ఉంటుంది. ఏడు నిమిషాలలో 1500 మీటర్ల దూరం పరుగెత్తిన అనంతరం దరఖాస్తుదారులను వైద్య పరీక్షకు పంపుతున్నారు. 'దరఖాస్తుదారులలో సగం మంది వైద్య పరీక్షలకు హాజరవుతారు. ఆ పరీక్షలో ఉత్తీర్ణులైనవారే ఉద్యోగానికి అర్హులు' అని సెంట్రల్ రైల్వే పిఆర్ఒ అనిల్ కె. సింగ్ చెప్పారు.
Pages: 1 -2- News Posted: 12 January, 2010
|